రజినీనే రిజెక్ట్ చేశారు... చిరు ఒక లెక్కా..!!

Thu 06th Dec 2018 10:37 PM
sye raa,2.0 collections,rajinikanth,chiranjeevi  రజినీనే రిజెక్ట్ చేశారు... చిరు ఒక లెక్కా..!!
For Audience Chiru and Rajini Not a Matter రజినీనే రిజెక్ట్ చేశారు... చిరు ఒక లెక్కా..!!
Sponsored links

సూపర్ స్టార్ రజినీకాంత్ ఉన్నాడనే ధీమాతో 2.0 చిత్రాన్ని సీజన్ కానీ సీజన్ లో రిలీజ్ చేసారు మేకర్స్. కానీ ఇదివరకులాగా తమిళ జనాలు రజినిని ఆదరించకలేపోతున్నారు. గత చిత్రాలు 'కబాలి'..'కాలా' రెండు సినిమాలను దారుణంగా తిప్పి కొట్టిన తమిళ జనత 2.0 చిత్రాన్నీ కూడా అదే రీతిలో తిప్పికొట్టారు. కనీసం తెలుగు వారు ఆదరించనట్టుగా అయినా తమిళ జనాలు ఆదరించలేకపోతున్నారు. దాంతో ఈచిత్రం తమిళంలో డిజాస్టర్ గా మిగిలిపోనుంది.

ఇప్పుడున్న రోజుల్లో స్టార్ హీరో మీద నమ్మకంతో ఇష్టమొచ్చినట్టు ఖర్చు పెడితే థియేటర్స్ వద్ద టికెట్స్ తెగట్లేదు. ఆ రోజులు పోయాయి. సినిమాలో కంటెంట్ ఉంటేనే జనాలు ఆదరిస్తున్నారు లేకపోతే సర్దుకో గురు అనేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి 'సైరా' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు కూడా నిర్మాత రామ్ చరణ్ భారీగా ఖర్చు పెట్టేస్తోన్న విషయం తెలిసిందే.

చిరంజీవి రీఎంట్రీ మూవీ కాబట్టి 'ఖైదీ నంబర్‌ 150' చూసారు... అంతే కానీ 'సై రా' ఈసినిమా చూస్తారు అనే గ్యారెంటీ లేదు. రజినీకాంత్ లాంటి స్టార్ హీరోనే రిజెక్ట్ చేసారు. చిరంజీవి పెద్ద లెక్కమి కాదు. సో అలోచించి ఖర్చు పెడితే మంచిది. అవసరం అయితే రీషూట్లు చేసి అవుట్ ఫుట్ అంత ఓకే అనుకున్నాకే రిలీజ్ చేస్తే మంచిది అంటున్నారు ట్రేడ్ నిపుణులు.

Sponsored links

For Audience Chiru and Rajini Not a Matter:

Tamil Cine Lovers Rejected 2.0..Telugu Cine Lovers Rejected Sye raa

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019