సత్యం థియేటర్ పై బన్నీ కన్ను పడింది

Thu 06th Dec 2018 08:21 AM
allu arjun,satyam theatre,multiplex,mahesh babu  సత్యం థియేటర్ పై బన్నీ కన్ను పడింది
Allu Arjun Planning to Start Multiplex Business సత్యం థియేటర్ పై బన్నీ కన్ను పడింది
Sponsored links

ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సగానికిపైగా థియేటర్ల మీద ఆధిపత్యం ప్రదర్శిస్తున్న అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ ఇప్పుడు కొత్తగా సత్యం థియేటర్ మీద ప్రత్యేకించి కాన్సన్ ట్రేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మీరు ఆలోచించేస్తున్నారా?. మీరు నమ్మినా, నమ్మకపోయినా గీతా ఆర్ట్స్ సాక్షిగా ఇది నిజం. ఈమధ్య మహేష్ బాబు "ఎ.ఎం.బి సినిమాస్"తో మల్టీప్లెక్స్ రంగంలోకి దిగడంతో.. మహేష్ ను స్ఫూర్తిగా తీసుకొని అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ రంగంవైపు అడుగులేయనున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

అందుకోసం సిటీకి సరిగ్గా సెంటర్ లో ఉన్న సత్యం థియేటర్ ను ఎంచుకున్నాడట. పైకి కనిపించదు కానీ.. ఆ థియేటర్ ఉన్న ప్లేస్ చాలా పెద్దది. అందుకే.. థియేటర్ ను మొత్తానికి కూలగొట్టి.. ఆ స్థానంలో ఓ మల్టీప్లెక్స్ ను నిర్మించే ఆలోచనలో ఉన్నాడట అల్లు అర్జున్. ఈమేరకు ప్లానింగ్ అంతా పూర్తైందని, త్వరలోనే పనులు మొదలుపెట్టనున్నాడని తెలుస్తోంది. 

"నా పేరు సూర్య" డిజాస్టర్ తర్వాత ఇప్పటివరకూ తన తదుపరి చిత్రం ఏమిటనే విషయంలో క్లారిటీ ఇవ్వని అల్లు అర్జున్ ఇప్పుడు బిజినెస్ పై కాన్సన్ ట్రేట్ చేస్తుండడంతో.. ఇప్పుడప్పుడే ఆయన నెక్స్ట్ సినిమా గురించి కన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

Sponsored links

Allu Arjun Planning to Start Multiplex Business:

Allu Arjun planning to start multiplex business

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019