మాస్ రాజా ఈ సారైనా కొడ‌తాడా?

mass raja get hit this timemass raja get hit this time

క‌ల్యాణ్‌రామ్ నిర్మించిన `కిక్‌-2` నుంచి మాస్ రాజా టైమ్ క‌లిసి రావ‌డంలేదు. వ‌రుస ఫ్లాపుల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అయినా అత‌నితో సినిమాలు నిర్మించ‌డానికి నిర్మాత‌లు వెనుకాడ‌టం లేదు. ఇప్ప‌టికే ఈ ఏడాది ర‌వితేజ ఖాతాలో `ట‌చ్ చేసి చూడు`, `నేల టిక్కెట్‌` తాజాగా `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` వంటి డిజాస్ట‌ర్‌లు వ‌చ్చిప‌డ్డాయి. అయినా మాస్ రాజా ర‌వితేజ‌ జోరు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఈ నెల‌లో ఓ సినిమాను ప‌ట్టాలెక్కిస్తున్నర‌వితేజ జ‌న‌వ‌రిలో మ‌రో చిత్రాన్ని కూడా మొద‌లుఎట్టేసేందుకు రెడీ అయిపోతున్నాడు.

ఈ సారి మురుగ‌దాస్ శిష్యుడైన వి.ఐ.ఆనంద్ని న‌మ్ముకున్నాడు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో `నేల టిక్కెట్‌` ఫేమ్ రామ్ తాళ్లూరి ఓ సినిమా చేయ‌డానికి సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఆద్యంతం ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌తో ఈ చిత్రాన్ని వి.ఐ.ఆనంద్ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిసింది. కావాల్సిన గ్లామ‌ర్‌ని జోడించి ఈ సినిమాతో ఈ సారి గ‌ట్టి హిట్‌ని కొట్టాల‌నే క‌సితో ర‌వితేజ ఉన్న‌ట్లు చెబుతున్నారు. `డిస్కోరాజా` అనే పేరుతో రూపొంద‌నున్నఈ సినిమాలో మాస్ రాజాకు జోడీగా ముగ్గుకు గ్లామ‌ర‌స్ హీరోయిన్‌లు న‌టించ‌బోతున్నారు. 

`ఆర్ ఎక్స్ 100` సినిమాతో యువ‌త‌ను షాక్‌కు గురిచేసిన పాయ‌ల్ రాజ్‌పుత్ ఓ హీరోయిన్‌గా న‌టించ‌నుండ‌గా మ‌రో నాయిక‌గా `న‌న్ను దోచుకుందువ‌టే` ఫేమ్ న‌భా న‌టేష్‌ను ఎంపిక చేశారు. ఇక మూడ‌వ నాయిక‌గా `టాక్సీవాలా` ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ న‌టించ‌నుంది. ముగ్గురు క‌ల‌ర్‌ఫుల్ నాయిక‌ల‌తో ఈ చిత్రాన్నిఈ నెల 12న మొద‌లుపెడుతున్నాడు ర‌వితేజ. త‌ను కోరుకున్న‌ట్టే ఈ సినిమాతో గ‌ట్టి స‌క్సెస్‌ని సొంతం చేసుకుని మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడో చూడాలి. 

mass raja get hit this time

raviteja
mass raja
v.i.anand
payal rajput
nabha natesh
priyanka jawalkar
ram talluri
amar akbar antony