Advertisement

రాజమౌళి సంతోషానికి కారణం తెలుసా?

Fri 23rd Nov 2018 03:07 PM
aakashavani,ss karthikeya,happy,rajamouli,kala bhairava  రాజమౌళి సంతోషానికి కారణం తెలుసా?
Rajamouli Shared his happiness Tweet రాజమౌళి సంతోషానికి కారణం తెలుసా?
Advertisement

ప్రస్తుతం తెలుగు సినిమాలలో మంచి ట్రెండ్‌ నడుస్తోంది. మరి ఇది కొత్తగా వస్తూ, సరికొత్త ఆలోచనలు, వైవిధ్యభరితమైన కాన్సెప్ట్‌లతో వస్తున్న నవతరం దర్శకులు, నిర్మాతల వల్లా? లేక ప్రేక్షకులు స్టార్స్‌ని చూసి కాకుండా కంటెంట్‌ ఉన్న చిత్రాలకు ఘనవిజయాలను అందిస్తూ వస్తున్నందున వచ్చిన మార్పా? అనేది పక్కనపెడితే ప్రస్తుతం దేశంలోని అన్ని భాషా చిత్రాల వారు టాలీవుడ్‌వైపు ఆసక్తిగా చూస్తున్నారు. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్‌, బెంగాళీ, తమిళ, మలయాళ భాషలకే పరిమితమైన డిఫరెంట్‌ చిత్రాలు తెలుగులో జోరందుకున్నాయి. ఇక విషయానికి వస్తే జక్కన్న రాజమౌళికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ ఏమిటో అందరికీ తెలిసిందే. ఈయన చిత్రాలకు విజయేంద్రప్రసాద్‌, కీరవాణి వంటి వారితో పాటు ఆయన కుమారుడు ఎస్‌.ఎస్‌.కార్తికేయ వంటి యంగ్‌టాలెంటెడ్‌ పర్సన్‌ కూడా మూల స్థంభాలలో ఒకడిగా చెప్పుకోవాలి. 

ఇక ఈయన త్వరలో నిర్మాతగా అవతారం ఎత్తనున్నాడని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా దానిని నిజం చేస్తూ కార్తికేయ ‘షోయింగ్‌ బిజినెస్‌’ బేనర్‌లో వరుస చిత్రాలను నిర్మించడానికి శ్రీకారం చుట్టాడు. ఈ సంస్థలో నుంచి వస్తున్న మొదటి చిత్రం టైటిల్‌ ‘ఆకాశవాణి’. సాధారణంగా రేడియోకు తెలుగులో ఉన్న పదం అది. కొత్తదనాన్ని బేనర్‌, సినిమా టైటిల్‌లోనే రుచి చూపించిన కార్తికేయ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ని కూడా ఎంతో ఆసక్తిని రేకెత్తించేలా ప్లాన్‌ చేశాడని ఈ పోస్టర్‌ని చూస్తేనే అర్ధం అవుతుంది. చీకట్లో అర్ధరాత్రి పూట జనాలు కర్రలు పట్టుకుని ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. ఆకాశం నిండా నక్షత్రాల చుక్కలే కనిపిస్తూ ఉంటాయి. ఆ నక్షత్రాల చుక్కల మద్యలో రేడియో అదేనండీ ఆకాశవాణి రూపురేఖలలో ఒక ఆకారం కనిపిస్తూ ఉంటుంది. ఆకాశంలోంచి ఓ తోకచుక్క భూమి వైపు వస్తూ ఉంటుంది. ఈ పోస్టర్‌ని చూస్తే ఆమద్య సెల్వరాఘవన్‌ అలియాస్‌ శ్రీరాఘవ అనుష్క, ఆర్య జంటగా తీసిన ‘వర్ణ’ చిత్రం పోస్టర్స్‌ మైండ్‌లో మెదులుతాయి. 

స్టార్‌ రైటర్‌గా పేరొందిన సాయిమాధవ్‌ బుర్రా సంభాషణలు అందిస్తున్న ఈ చిత్రం ద్వారా రాజమౌళి శిష్యుడు, అశ్విన్‌ గంగరాజు దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. మరోవైపు కీరవాణి కుమారుడు కాలభైరవ సంగీతం అందిస్తూ ఉండటం విశేషం. ఈ కాన్సెప్ట్‌ పోస్టర్‌ లుక్‌ని రాజమౌళి తన ట్విట్టర్‌ ద్వారా పంచుకుని ఆనందం వ్యక్తం చేశాడు. ‘ఈ క్షణంలో నాకంటే సంతోషకరమైన వ్యక్తి ఎవరుంటారు? ఆకాశవాణి చిత్రం ద్వారా నా బోయ్స్‌ కార్తికేయ, కాలభైరవ పరిచయం అవుతున్నారు. నా వద్ద సహాయ దర్శకునిగా పనిచేసిన అశ్విన్‌ గంగరాజు దర్శకునిగా మారుతున్నాడు. చిత్ర బృందానికి గుడ్‌లక్‌’ అని ట్వీట్‌ చేశాడు. అయితే ఇప్పటివరకు రాజమౌళి శిష్యులు.. దర్శకులుగా పరిచయం అయినా ఎవ్వరూ మెప్పించలేకపోయారు. మరి ఈ సెంటిమెంట్‌ని అశ్విన్‌ అధిగమిస్తాడేమో వేచిచూడాల్సివుంది...! 

Rajamouli Shared his happiness Tweet:

SS Rajamouli Happy with Aakashavani

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement