Advertisement

1000 కోట్లు: నయనతార రేంజ్ ఇది..!

Thu 13th Sep 2018 03:20 PM
nayanthara,1000 crores,sye raa,ajith,kamal  1000 కోట్లు: నయనతార రేంజ్ ఇది..!
Nayanthara Range Revealed 1000 కోట్లు: నయనతార రేంజ్ ఇది..!
Advertisement

సౌత్ లో టాప్ హీరోయిన్ ఎవరయ్యా అంటే ఖచ్చితంగా ముందుగా నయనతార పేరే చెబుతారు. ఎందుకంటే కోలీవుడ్ లో స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఏకైక హీరోయిన్ నయనతారే కావడం ఇందుకు నిదర్శనం. స్టార్ హీరోల పక్కన స్టార్ హీరోయిన్ గాను, యువ హీరోల పక్కన గ్లామర్ భామగాను, లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో తనదైన శైలిలో ఆకట్టుకునే నయనతార చేతిలో ఇప్పుడు 100 కోట్ల ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయనే టాక్ కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీస్ ని షేక్ చేస్తుంది. మామూలుగానే నయనతార హీరోయిన్ అంటే ఆ సినిమాకి స్పెషల్ క్రేజొస్తుంది. ఇక స్టార్ హీరోలు భారీ బడ్జెట్ చిత్రాలంటే ఇక ఆ సినిమాలకు ఏ రేంజ్ క్రేజుంటుందో అర్ధం చేసుకోవచ్చు. 

ఇక లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న నయనతార ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలైన కొన్ని బిగ్ భారీ ప్రాజెక్టులలో నటిస్తుంది. టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రామ్ చరణ్ నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 200 కోట్లు బడ్జెట్ మూవీ సై రా నరసింహారెడ్డి సినిమాలోనూ,  అలాగే తమిళ్ లో శంకర్ - కమల్ క్రేజీ కాంబోలో తెరకెక్కనున్న భారతీయుడు 2 ని నిర్మాతలు దాదాపుగా 500  కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించే సినిమాలలో నయనతారే హీరోయిన్. అంతేకాకుండా  ప్రస్తుతం కోలీవుడ్ లోనే అజిత్ తో కలిసి విశ్వాసం సినిమాలో కూడా నయనతారే హీరోయిన్. అజిత్ సినిమాని శివ దర్శకత్వంలో సుమారు 100 కోట్లతో నిర్మాతలు నిర్మిస్తున్నారు.

మరి ఇంత భారీ ప్రాజెక్టులన్నీ కలుపుకొని మొత్తంగా దాదాపు 1000 కోట్లు బడ్జెట్ చిత్రాల్లో నయనతార నటిస్తూ రికార్డు సృష్టించేస్తుంది. మరి ఇలా ఒకే హీరోయిన్ ఇలా సౌత్ లో ఒకేసారి 1000 కోట్ల ప్రాజెక్టులను టచ్ చెయ్యడమే కాదు... ఆ సినిమాల్లో లీడ్ హీరోయిన్ గా నటించడం అంటే ఆమెకి ఎనలేని క్రేజుండడమే కాదు... ఈ భారీ ప్రాజెక్టులతో నయనతార పేరు ఇండియా వైడ్ గా మార్మోగిపోవడం ఖాయమే. ఎందుకంటే చిరు సైరా నరసింహారెడ్డి, శంకర్ - కమల్ ల భారతీయుడు 2 సినిమాలు ఇండియా వైడ్ గా విడుదలకాబోతున్నాయి. మరి నయనతార క్రేజుని అందుకోవడానికి సౌత్ హీరోయిన్స్ చాలా టైం పట్టేలా లేదు.

Nayanthara Range Revealed:

Nayanthara at Rs 1000 Crores 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement