Advertisement

యూట్యూబ్ కింగ్ ఎవరంటే.. బన్నీనే..!

Wed 18th Jul 2018 11:38 AM
  యూట్యూబ్ కింగ్ ఎవరంటే.. బన్నీనే..!
Allu Arjun’s ‘Sarrainodu’ Hindi dubbed version clocks 200 million views on YouTube యూట్యూబ్ కింగ్ ఎవరంటే.. బన్నీనే..!
Advertisement

వాస్తవానికి ఇప్పటికి కూడా అల్లుఅర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శత్వంలో వచ్చిన మాస్‌ ఎంటర్‌టైనర్‌ని చాలా మంది విశ్లేషకులు పెదవి విరుస్తూ యావరేజ్‌ కంటెంట్‌ ఉన్న చిత్రంగా చెబుతూ వస్తున్నారు. కానీ ఈ చిత్రం విమర్శకులను, విశ్లేషకులను మెప్పించలేకపోయినా సామాన్య ప్రేక్షకులను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది. 2016లో వచ్చిన ఈ చిత్రం 50కోట్ల బడ్జెట్‌తో రూపొందగా మొత్తంగా 127కోట్లను వసూలు చేసింది. రకుల్‌ప్రీత్‌సింగ్‌, కేథరిన్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌ బేనర్‌లోనే నిర్మించడం విశేషం. 

ఇక ఈ చిత్రం తాజాగా భారతదేశంలో ఇప్పటి వరకు ఏ చిత్రం సాధించని రికార్డును సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో ఈ మూవీ హిందీ వెర్షన్‌ని తాజాగా 20కోట్ల మంది వీక్షించారు. ఇలా 200మిలియన్లు దాటిన మొదటి చిత్రంగా ఇది రికార్డులను క్రియేట్‌ చేసింది. 200,798,188 మంది ఈ చిత్రాన్ని వీక్షించగా ఆరు లక్షల మందికి పైగా దీనిని లైక్‌ చేశారు. గతంలో ఏ భారతీయ చిత్రం సాధించని రికార్డును ఇది సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం యూట్యూబ్‌ వెర్షన్‌ని కొనుగోలు చేసిన గోల్డ్‌మైన్స్‌ టెలీఫిల్మ్స్‌ సంస్థకి ఇది లాభాల వర్షం కురిపించింది. ఇందులో గుణ అనే పవర్‌ఫుల్‌ పాత్రలో అల్లుఅర్జున్‌ నటించగా, ఆది పినిశెట్టి విలన్‌గా బన్నీకి పోటాపోటీగా నటించాడు. 

ఈ చిత్రం ద్వారా ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా తెలుగు చిత్రాల హవా ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతోంది. ముఖ్యంగా మన మాస్‌, యాక్షన్‌ చిత్రాలకు ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారని మరోసారి నిరూపితం అయింది. మరి దీని వల్ల రాబోయే బన్నీ చిత్రాలకు యూట్యూబ్‌ రైట్స్‌ భారీ రేటును పలకడం గ్యారంటీ అనే చెప్పాలి.

Allu Arjun’s ‘Sarrainodu’ Hindi dubbed version clocks 200 million views on YouTube:

Allu Arjun Sarrainodu sets a new Indian Record

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement