చరణ్ లో ఛేంజ్ కి కారణం ఉపాసనే!

Sat 14th Jul 2018 05:59 PM
upasana,ram charan,comedy movies,biopics,mega power star,change  చరణ్ లో ఛేంజ్ కి కారణం ఉపాసనే!
Mega Power Star Ram Charan about Biopic Movies చరణ్ లో ఛేంజ్ కి కారణం ఉపాసనే!
Sponsored links

సమాజంలో సహజంగానే పెళ్లి కాకముందు... బ్యాచ్‌లర్‌ లైఫ్‌లో మన ప్రవర్తన, అలవాట్లు డిఫరెంట్‌గా ఉంటాయి. కానీ పెళ్లయిన తర్వాత వాటిని తమ భార్యలకు అనుగుణంగా మార్చుకోకతప్పదు. ఇలు ఇరకటమైనా,పెళ్లాం మరకటమైనా కూడా పెళ్లయితే మా అబ్బాయిలో మార్పు వస్తుంది అని భావించే తల్లిదండ్రులకు కొదువలేదు. ప్రతి ఒక్కరూ మా అబ్బాయికి ఏ అలవాట్లు ఉన్నా అతనికి కాబోయే భార్య వల్ల అతను బుద్దిమంతుడుగా మారుతాడని చెబుతుంటారు. ఈ విషయంలో ఇప్పటికే జూనియర్‌ ఎన్టీఆర్‌ తన పెళ్లి తర్వాత తనలో ఎంతో మార్పు వచ్చిందని చెప్పుకొచ్చాడు. అంతకు ముందు ప్రతి విషయానికి ఎంతో ఆవేశంగా బదులిచ్చి మీడియాను కూడా దూరం చేసుకున్న ఎన్టీఆర్‌ ప్రస్తుతం తన పద్దతి మార్చుకున్నాడు. 

ఇక ఇలా భార్య మాట విని తన అభిరుచిని మార్చుకున్న వారిలో మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా ఉన్నాడు. ఈ విషయం తాజాగా బయటకు వచ్చింది. రామ్‌చరణ్‌ మాట్లాడుతూ, నాకు బయోపిక్‌లంటే ఇష్టం. ఎందుకంటే అందులో నిజాలను చూపిస్తారు. అందుకే అవి నాకు నచ్చుతాయి. అయితే బయోపిక్‌లలో నటించే అవకాశం నాకు వస్తే వాటికి న్యాయం చేయగలనా? లేదా? అనేది మాత్రం చెప్పలేను. ఇటీవల 'సంజు' బయోపిక్‌ చూశాను. రణబీర్‌కపూర్‌ అద్భుతంగా నటించాడని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఆయన ఇంకా మాట్లాడుతూ, నా భార్య ఉపాసనకు కామెడీ చిత్రాలంటే బాగా ఇష్టం. అందువల్లే ఆమె కోసం తాను కూడా కామెడీ చిత్రాలను ఈమధ్య తరచుగా చూస్తూ ఉన్నానని, ఇలా తనకు కామెడీ చిత్రాల ద్వారా రిలాక్స్‌ కల్పిస్తున్న ఉపాసనకు ధన్యవాదాలని తెలిపాడు. 

ఇక రామ్‌చరణ్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఆ వెంటనే ఆయన ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటించే మల్టీస్టారర్‌ షూటింగ్‌లో జాయిన్‌ అవుతాడు. 

Sponsored links

Mega Power Star Ram Charan about Biopic Movies:

Upasana is reason for his comedy timing says Charan

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017