ఒరిజినల్ కంటే అభిమాని చేసిందే నచ్చింది!

Sat 14th Jul 2018 01:42 PM
shah rukh khan,zero,fan made teaser,impressed  ఒరిజినల్ కంటే అభిమాని చేసిందే నచ్చింది!
Shah Rukh Khan Is Amazed By This Fan-Made Animated Teaser Of 'Zero' ఒరిజినల్ కంటే అభిమాని చేసిందే నచ్చింది!
Sponsored links

బాలీవుడ్‌ కింగ్‌ ఖాంగ్‌ షారుఖ్‌ఖాన్‌ ప్రస్తుతం ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో 'జీరో' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ఏడాది క్రిస్మస్‌ కానుకగా విడుదల కానున్నఈ చిత్రం టీజర్‌ని ఇటీవల రంజాన్‌ సందర్భంగా విడుదల చేశారు. గతంలో కమల్‌హాసన్‌ 'విచిత్ర సోదరులు' చిత్రంలో నటించినట్లుగా షారుఖ్‌ఖాన్‌ కూడా ఇందులో మరగుజ్జు పాత్రను పోషిస్తున్నాడు. ఈ టీజర్‌లో షారుఖ్‌ అందరు తనని చూడాలని భావిస్తున్నట్లు అనుకుని స్టైల్‌గా ముందుకు రావడం, కానీ వెనుక సల్మాన్‌ఖాన్‌ ఎంట్రీ ఇవ్వడం వంటివి టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ లభించేలా చేశాయి.

ఆ తర్వాత షారుఖ్‌, సల్మాన్‌ కలిసి డ్యాన్స్‌ చేయడం, షారుఖ్‌.. సల్మాన్‌ చంకనెక్కి ముద్దు పెట్టుకోవడం అనేవి అలరిస్తున్నాయి. ఈ టీజర్‌ని రాహుల్‌ అనే అభిమాని క్రాషింగ్‌ క్యూబ్స్‌ పేరిట యానిమేషన్‌ రూపంలో రూపొందించాడు. ఇందులో షారుఖ్‌, సల్మాన్‌ల యానిమేషన్‌ బొమ్మలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్‌ని రాహుల్‌ షారుఖ్‌కి ట్యాగ్‌ చేసి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోకు షారుఖ్‌ ఫిదా అయిపోయాడు.

'ఈ టీజర్‌ ఎంత స్వీట్‌గా ఉంది. ధన్యవాదాలు' అని రాహుల్‌కి తెలిపాడు. ఇక ఈ చిత్రం కోసం అందరు వేయికళ్లతో వెయిట్‌ చేస్తున్నారు. ఎందుకంటే కరణ్‌ అర్జున్‌ చిత్రం తర్వాత షారుఖ్‌, సల్మాన్‌ కలిసి నటిస్తున్నచిత్రం ఇదే కావడం విశేషం. ఇక జీరో చిత్రంలో షారుఖ్‌ సరనన అనుష్కశర్మ, కత్రినాకైఫ్‌లు కలిసి నటిస్తున్నారు. 

Sponsored links

Shah Rukh Khan Is Amazed By This Fan-Made Animated Teaser Of 'Zero' :

‘Zero’ fan made teaser: Shah Rukh Khan is super IMPRESSED and praises the makers

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017