బ్రేకింగ్: యంగ్ టైగర్ కి మరో బుల్లి టైగర్!

Fri 15th Jun 2018 12:28 AM
jr ntr,young tiger ntr,lakshmi pranathi,baby boy,abhay ram  బ్రేకింగ్: యంగ్ టైగర్ కి మరో బుల్లి టైగర్!
Jr NTR Blessed With A Baby Boy Again బ్రేకింగ్: యంగ్ టైగర్ కి మరో బుల్లి టైగర్!
Sponsored links

మొన్నీ మధ్యన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి పాప పుట్టింది అనే వార్త... సోషల్ మీడియాలో వీర విహారం చేసింది. ఎన్టీఆర్ - లక్ష్మి ప్రణతికి మొదట అబ్బాయి అభయ్ రామ్ కాగా.. రెండోసారి అమ్మాయి పుట్టిందని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను ఎన్టీఆర్ పీఆర్వో మహేష్ కోనేరు ఖండించారు. ఎన్టీఆర్ కి అమ్మాయి పుట్టలేదని.. అసలు ఇంకా డెలివరీ అవ్వలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఇక తాజాగా టైగర్ ఎన్టీఆర్ మరోమారు తండ్రయ్యాడు. మొదటిసారి ఎన్టీఆర్ - లక్ష్మీప్రణతిల జంట కు అభయ్ రామ్ పుట్టాడు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఆ దంపతులకి బాబు పుట్టాడు. తనకి బాబు పుట్టాడు అనే విషయాన్నీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వయంగా తన సోషల్ మీడియా పేజీ ద్వారా తన అభిమానులకు చేరవేసాడు. The family grows bigger. ఇట్స్ ఏ బాయ్! (కుటుంబం పెద్దది అయ్యింది...) అంటూ తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాల్లో దూసుకుపోతున్నాడు. వరుస హిట్స్ తో ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో పూజ హెగ్డే తో కలిసి అరవింద సమేత - వీర రాఘవ సినిమాలో నటిస్తున్నాడు.

Sponsored links

Jr NTR Blessed With A Baby Boy Again:

Jr NTR's wife Lakshmi Pranathi gives birth to baby boy

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017