నేను సురక్షితంగా వున్నా: దీపికా పదుకునే!

Thu 14th Jun 2018 10:56 PM
deepika padukune,fire accident,deepika padukune house,bollywood heroine  నేను సురక్షితంగా వున్నా: దీపికా పదుకునే!
Fire At Deepika Padukone Building నేను సురక్షితంగా వున్నా: దీపికా పదుకునే!
Sponsored links

తాజాగా ముంబైలోని వర్లీ అనే ప్రాంతంలో 45 అంతస్థుల భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అపార్ట్‌మెంట్‌లోనే బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకునే నివాసం ఉంటోంది. ఈ వార్త తెలిసిన సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకుని మంటలు వ్యాపించకుండా రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 100 మందికి పైగా రక్షించామని, మంటలు అదుపులోకి తెస్తున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. ప్రాణ నష్టం ఏమి జరగకపోయి ఉండవచ్చని పోలీసులు అంటున్నారు.

ఈ మంటలను ఆర్పేందుకు ఆరు ఫైర్‌ ఇంజన్లు, ఐదు జంబో ట్యాంకర్స్‌, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ వార్త సోషల్‌ మీడియాలో దావానంలా వ్యాపించింది. దీనిపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ అభిమాన నటి ఎలా ఉందో అని కంగారు పడ్డారు. ఆమె నుంచి గంట తర్వాత కూడా ఎలాంటి వార్త రాకపోవడంతో ఈ ఆందోళన మరింతగా పెరిగింది. ఎట్టకేలకు ఆమె ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. 

నేను సురక్షితంగా ఉన్నాను. అందరికీ కృతజ్ఞతలు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రమాదాన్ని నివారించేందుకు కృషి చేస్తున్న సిబ్బంది కోసం మనం ప్రార్ధన చేద్దాం అని తెలిపింది. మరి ప్రాణనష్టం అయితే జరగలేదు. కానీ ఆస్తినష్టం ఏమైనా జరిగిందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...! 

Sponsored links

Fire At Deepika Padukone Building:

Deepika Padukone Says She Is Safe After Fire At Building Where She Lives

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017