నానికి భార్య సపోర్ట్..!

Thu 14th Jun 2018 06:49 PM
hero nani,wife,anjana,sri reddy issue  నానికి భార్య సపోర్ట్..!
Anjana Supports Her Husband in Sri Reddy Issue నానికి భార్య సపోర్ట్..!
Sponsored links

మిగిలిన రంగాల కంటే సినిమా రంగం కాస్త విభిన్నమైనది. ఇక్కడ ఏమీ లేకపోయినా కూడా ఆయా వ్యక్తులతో ఇతరులతో పలు ఎఫైర్స్‌ని ప్రచారం చేస్తూ ఉంటారు. వీటిలో కొన్ని నిజమైనా, కొన్ని మాత్రం కేవలం ఉత్తి గాసిప్స్‌ మాత్రమే. అలాంటి సమయంలో ఇలాంటి సినీ సెలబ్రిటీలకు కుటుంబసభ్యుల అండ, వారి నమ్మకం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా పెళ్లయిన నటీనటులకు ఎఫైర్స్‌ విషయంలో వార్తలు వస్తే వారి సహధర్మచారులు వాటిని లైట్‌గా తీసుకోవాలి. అదే ఏమాత్రం నిజమని నమ్మినా కాపురాలు కూలిపోతాయి. ఇక విషయానికి వస్తే నటి శ్రీరెడ్డి ఈమధ్య వరుసగా నాని మీద నానా ఆరోపణలు చేస్తోంది. నాని తెర వెనుక అంత మంచోడు కాదని, ఆయన అసలు రూపం తెలిస్తే ప్రేక్షకులే కాదు ఆయన కుటుంబ సభ్యులు, భార్య కూడా ఉమ్మేస్తారని వ్యాఖ్యానించింది. తనతో నాని అవకాశాలు ఇప్పిస్తానని మోసం చేశాడని, తన ఫ్లాట్‌కి తరచు వచ్చే వాడని ఆమె రాయలేని భాషలో నానిపై విరుచుకుపడింది. 

ఇక దీనిపై నాని శ్రీరెడ్డిపై చట్టపోరాటం చేసేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే తన లాయర్ల ద్వారా శ్రీరెడ్డికి నోటీసులు పంపించి, పరువు నష్టం దావా కూడా వేశాడు. మరోవైపు శ్రీరెడ్డి కూడా నాని విషయంలో తాను కూడా చట్టపరంగానే చర్యలు తీసుకుంటానని తేల్చిచెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో నాని భార్య మాత్రం తన భర్తపై అపారమైన నమ్మకం వ్యక్తం చేసి, శ్రీరెడ్డి ఆరోపణలు నిజం కాదని, నాని మంచి బాలుడని సర్టిఫికేట్‌ ఇచ్చింది. 

తాజాగా నాని భార్య మాట్లాడుతూ, సినీ పరిశ్రమ చాలా గొప్పది. ఈ పరిశ్రమ ఎంతో దయాగుణంతో ఉంటుంది. కానీ కొందరు పబ్లిసిటీ కోసం ఇతరుల జీవితాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వేరొకరి జీవితాలతో ఆటలాడుకునే వారు ఈ పరిశ్రమలోకి రావడం నాకు ఇబ్బందిని  గురి చేస్తోంది. అయినా వారు చేస్తున్న చెత్త కామెంట్లను ఎవ్వరూ పట్టించుకోరు. కానీ తమ వ్యక్తిగత జీవితాన్ని అంత దిగువ స్థాయికి దిగజార్చుకోవడానికి వారు ఎలా సిద్ద పడతారో అర్దం కావడం లేదని అంటూ తన భర్త నానికి మంచోడని సర్టిఫికేట్‌ ఇచ్చింది. 

Sponsored links

Anjana Supports Her Husband in Sri Reddy Issue:

Nani Wife Anjana Responds on Sri Reddy Issue

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017