ఈ అన్నదమ్ముల అనుబంధం చూడండి!

Sat 19th May 2018 01:56 PM
sp balasubramaniam,kj yesudas,relation,brothers  ఈ అన్నదమ్ముల అనుబంధం చూడండి!
SP Balu and Yesudas Relation ఈ అన్నదమ్ముల అనుబంధం చూడండి!
Sponsored links

పాటలు పాడటంలో గానగంధర్వుడు ఎస్పీబాలసుబ్రహ్మణ్యంతో పాటు ఏసుదాస్‌ని చెప్పుకోవాలి. ఒక విషాదగీతం అన్నా, మెలోడీ అన్నా, మంచి తాత్విక చింతన కలిగిన పాటలన్నా, లేక దేవుడి భక్తిగీతాలన్నా కూడా మనకి వెంటనే ఏసుదాస్‌ గుర్తుకు వస్తారు. ఇక ఈయనకు గానగంధర్వుడు ఎస్పీబాలసుబ్రహ్మణ్యంతో మంచి అనుబంధం ఉంది. ఏసుదాస్‌.. ఎస్పీబాలుని తన తమ్ముళ్ల కంటే ఎక్కువ అని చెప్పుకుంటాడు. వీరు కొన్నేళ్ల కిందట పారిస్‌లో ప్రోగ్రామ్స్‌ ఇవ్వడానికి వెళ్లారు. ఎక్కడ కచ్చేరి జరిగినా, దానికి ఏసుదాస్‌ హాజరవుతూ ఉంటే ఆయన భార్య కూడా ఆయనతో ఉంటుంది. కానీ ఓసారి మాత్రం ఆమె రాలేదు. నేను మాత్రం నాభార్యతో వెళ్లాను. 

నేను పూర్తిగా శాఖహారిని కావడంతో భోజనం విషయంలో ఇబ్బంది పడకూడదని కుక్కరు, పచ్చళ్లు, పొడులు తీసుకుని వెళ్తాను. ఏసుదాస్‌గారికి నాకు హొటల్‌లో పక్క పక్క రూమ్‌లే ఇచ్చారు. కచ్చేరి అయిన తర్వాత ఇద్దరం మా హోటల్‌రూమ్స్‌కి చేరుకున్నాం. నాకు భోజనం రెడీగా ఉంది. కానీ ఆయనకు భోజనం ఏర్పాటు చేశారా? లేదా? అనే అనుమానం వచ్చి హోటల్‌ వారిని అడిగితే వారు నీళ్లు నమిలారు. దాంతో నేను కంచెంలో అన్నం కలుపుకుని, రూమ్‌సర్వీస్‌ అంటూ తలుపు తట్టాను. ఆయనవచ్చి తలుపు తీసి ఏమిటయ్యా ఇదంతా....అంటూ ఆశ్యర్యపోయారు. 

నిర్వాహకులు భోజనం ఏర్పాటు చేయడం మర్చిపోయారని చెప్పాను. ఆ తర్వాత నేను తీసుకెళ్లిన భోజనం తింటూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు. జీవితంలో ఎన్నోదేవాలయాలు తిరిగాను. ఇంత చక్కని ప్రసాదం నాకు ఎక్కడా దొరకలేదు అని కన్నీరుపెట్టుకున్నారు. ఆరోజు నుంచి మేము మరింత దగ్గరయ్యాం. నాతమ్ముళ్ల కంటే ఎవరు ఎక్కువ అంటే బాలసుబ్రహ్మణ్యం అని ఏసుదాస్‌ చెప్పేవారు. ఇలా చాలా వేదికలపై ఆయన చెప్పారు అని ఎస్పీబాలు చెప్పుకొచ్చారు. 

Sponsored links

SP Balu and Yesudas Relation:

SP Balasubramaniam about KJ Yesudas

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017