'సైరా'పై చరణ్ స్కెచ్ మాములుగా లేదు!

Fri 18th May 2018 11:33 PM
sye raa narasimha reddy,ram charan,business,tollywood,baahubali,sketch,craze  'సైరా'పై చరణ్ స్కెచ్ మాములుగా లేదు!
Ram Charan Sketch for Sye Raa Business 'సైరా'పై చరణ్ స్కెచ్ మాములుగా లేదు!
Sponsored links

తెలుగు సినీ ప్రేక్షకులకు టేస్ట్ మారిందనే చెప్పాలి. రొటీన్‌ కమర్షియల్‌ సినిమాలే కాదు డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలని కూడా నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకు కారణం 'బాహుబలి'.. 'రంగస్థలం'. 'బాహుబలి' సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కొత్తగా ఉండడంతో జనాలు దాని ఇండస్ట్రీ హిట్ ని చేసేసారు. 'రంగస్థలం' సినిమా అంతటి విజయం వెనుక పీరియడ్‌ సెటప్పే.

అయితే కథ ఉంటే కమర్షియల్‌ సినిమాలైనా జనాలు లైక్ చేస్తారు అని అర్ధం అయింది. దాంతో 'సైరా నరసింహారెడ్డి'పై బయ్యర్లలో మరింత నమ్మకం పెరిగింది. 'బాహుబలి' సినిమా తర్వాత ఈ చిత్రం అంతటి సంచలనం సృష్టించగలదని ఈ చిత్రంపై బయ్యర్లకి భరోసా పెరుగుతోంది. 200 కోట్లుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంకి తెలుగు రాష్ట్రాల నుంచే మూడొంతుల బిజినెస్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు.

దానిని క్యాష్ చేసుకునే పనిలో చరణ్ అండ్ టీం పనులు వేగవంతం చేశారు. మే 9 డేట్‌ని టార్గెట్‌ చేసారనే వార్తలు వస్తున్నాయి. తెలుగులో బిజినెస్ కి ఏ లోటు ఉండదని తెలుసుకుని.. తమిళ్..మలయాళం..హిందీ భాషల్లో ఈ సినిమాకు క్రేజ్‌ తీసుకురావడం ఎలా అనే దానిపై చరణ్‌ ఆలోచిస్తున్నాడు. ఆల్రెడీ బాలీవుడ్ లో కొంత మంది నిర్మాతలతో చరణ్ చర్చలు కూడా జరిపాడట.

Sponsored links

Ram Charan Sketch for Sye Raa Business:

Sye Raa Narasimha Reddy One More Baahubali to Tollywood

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017