ఎన్టీఆర్‌ తో అశ్వనీదత్‌ చేసే చిత్రమిదేనా?

Fri 18th May 2018 11:25 PM
jr ntr,atlee,vyjayanthi movies,ashwini dutt,young tiger ntr  ఎన్టీఆర్‌ తో అశ్వనీదత్‌ చేసే చిత్రమిదేనా?
NTR And Atlee Combo Movie in Vyjayanthi Movies Banner ఎన్టీఆర్‌ తో అశ్వనీదత్‌ చేసే చిత్రమిదేనా?
Sponsored links

ఇటీవల మహేష్‌బాబు మురుగదాస్‌ని దర్శకునిగా ఎంచుకుని తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా 'స్పైడర్‌' చిత్రం చేశాడు. ఈ చిత్రం ద్వారా మహేష్‌ తమిళంలోకి స్ట్రెయిట్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం సరిగా ఆడలేదు. మరోవైపు ప్రభాస్ 'బాహుబలి' తర్వాత 'సాహో'తో తెలుగుతో పాటు తమిళం హిందీ భాషలను టార్కెట్‌ చేస్తున్నాడు. గతంలో ఎప్పుడో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి 'సై..రా....నరసింహారెడ్డి'తో దేశవ్యాప్తంగా కన్నేశాడు. అల్లుఅర్జున్‌ లింగుస్వామితో ద్విభాషా చిత్రం చేస్తాడని వార్తలు వచ్చినా అది ఆగిపోయింది. 

ఇక త్వరలో అల్లుఅర్జున్‌ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో చేసే చిత్రం కూడా తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందనుందని సమాచారం. ఇలా నాగార్జున నుంచి సందీప్‌కిషన్‌, విశాల్‌ వరకు ఇదే రూట్‌ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ వంతు వచ్చింది. తమిళంలో ఆర్య-నయనతార జంటగా 'రాజు రాణి' తీసి, ఆ తర్వాత విజయ్‌తో 'తేరీ, మెర్సల్' చిత్రాలకు దర్శకత్వం వహించాడు యంగ్‌ డైరెక్టర్‌ అట్లీ కుమార్‌. ఈయన ఈ మధ్య తెలుగు హీరోలకు కొందరికి కథ వినిపించాడని వార్తలు వచ్చాయి. ఇక అట్లీతో పనిచేసేందుకు ఎన్టీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడట. 

'మెర్సల్'తో సంచలనం సృష్టించడమే కాదు....200కోట్ల క్లబ్‌లో ఈ చిత్రాన్నిఅట్లీ నిలిపాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ చిత్రంతో పాటు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో చేయబోయే మల్టీస్టారర్‌ కూడా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇక అట్లీ చిత్రం వాటి తర్వాత ప్రారంభం అవుతోంది. ఈ చిత్రానికి అశ్వనీదత్‌ నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. 

Sponsored links

NTR And Atlee Combo Movie in Vyjayanthi Movies Banner:

Jr NTR Next Movie With Mersal Director Atlee

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017