ఇద్దరు దిగ్గజాలతో.. తమన్‌..!

Fri 18th May 2018 04:13 PM
ss thaman,trivikram srinivas,sirivennela seetharama sastry,ntr28  ఇద్దరు దిగ్గజాలతో.. తమన్‌..!
SS Thaman About NTR28 Film ఇద్దరు దిగ్గజాలతో.. తమన్‌..!

అతి తక్కువ సమయంలోనే వేగంగా 50 చిత్రాలకు సంగీతం అందించిన ఘనత సొంతం చేసుకోవడంతో పాటు అతి తక్కువ వ్యవధిలో స్టార్‌ హీరోల చిత్రాలకు సంగీతం అందించిన ఘనత తమన్‌కి దక్కుతుంది. ఇక ఈయన నిన్నటి వరకు దేవిశ్రీప్రసాద్‌ జోరును అందుకోలేక వెనుకబడ్డాడు. ఈ ఏడాది మాత్రం 'భాగమతి, తొలిప్రేమ, ఛల్ మోహన్‌ రంగ' చిత్రాలకు మంచి సంగీతం అందించాడు. ఇక ఈయనలో ఉన్న ప్లస్‌ పాయింట్స్‌ ఏమిటంటే.. ట్యూన్స్‌ ఎంత క్యాచీగా ఇస్తాడో,.. బీజీఎం కూడా అంతే బాగా అందిస్తాడు. 

ఇక ఇదే సమయంలో దేవిశ్రీప్రసాద్‌ వరుసగా 'రంగస్థలం, భరత్‌ అనే నేను' వంటి పెద్ద హిట్స్‌ కొట్టాడు. ఈ తరుణంలో తమన్‌కి త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రానికి అనిరుధ్‌ స్థానంలో అవకాశం వచ్చింది. ఇక గతంలో త్రివిక్రమ్‌ తమన్‌తో పనిచేయకపోయినా ఎన్టీఆర్‌ పలు చిత్రాలకు పని చేశాడు. ఇక ఈ కొత్త కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం కోసం తమన్‌ ట్యూన్లని కూడా రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈమధ్య అనారోగ్యం కారణంగా పాటలను రాయడం తగ్గించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ తాజా చిత్రానికి పాటలకు సాహిత్యం అందిస్తుంటం విశేషంగా చెప్పాలి. 

కాగా తాజాగా త్రివిక్రమ్‌, తమన్‌, సిరివెన్నెల కలిసి తీసుకున్నఫొటోని తమన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. 'స్క్రిప్ట్‌ని అద్భుతంగా సిద్దం చేసే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, పాటలు అద్భుతంగా రాయగలిగిన సిరివెన్నెల సీతారామశాస్త్రితోనూ ఈరోజు కలిసి పనిచేశాను' అంటూ తమన్‌ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం షూటింగ్‌ బిజీగా జరుగుతుండగా, మరోవైపు ఆల్‌రెడీ రెండు ట్యూన్స్‌ని అందించిన తమన్‌ కూడా ఈ చిత్రం విషయంలో మంచి స్పీడుగా ఉన్నారు.

SS Thaman About NTR28 Film:

SS Thaman shares his excitement to be working with Trivikram and Sirivennela Seetharama Sastry

Latest

Latest

Popular in Times

Contact us    Privacy     © 2017