ప్రభాస్ నుంచి.. ఎన్టీఆర్ వైపు..!!

Fri 18th May 2018 03:20 PM
jr ntr,atlee,movie,prabhas,jr ntr with atlee  ప్రభాస్ నుంచి.. ఎన్టీఆర్ వైపు..!!
Atlee to direct Jr NTR? ప్రభాస్ నుంచి.. ఎన్టీఆర్ వైపు..!!
Sponsored links

బాహుబలి 2 టైం లో ప్రభాస్ హీరోగా తమిళ్ డైరెక్టర్ అట్లీ ఒక సినిమా చేయబోతున్నాడని... అందుకే అట్లీ బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హైదరాబాద్ వచ్చాడని.. తెగ ప్రచారం జరిగింది. తమిళంలో అట్లీ తెరకెక్కించిన తేరి, మెర్సెల్ సినిమాలు ఘన విజయం సాధించడం కూడా అట్లీ తో ప్రభాస్ సినిమా ఉంటుందని అందరూ భావించారు. కానీ ప్రభాస్ మాత్రం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాకి, రాధాకృష్ణ దర్శకత్వంలో మరో లవ్ స్టోరీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఇక అట్లీ కూడా తెలుగు హీరోలతో సినిమాలు చేస్తా కానీ ఇప్పుడు కాదని చెప్పాడు.

అయితే తాజాగా ప్రభాస్ తో కాకుండా అట్లీ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో వినబడుతుంది. తేరి, మెర్సెల్ చిత్రాలు సూపర్ హిట్ అవడంతో పాటుగా మంచి కలెక్షన్స్ కొల్లగొట్టడంతో అట్లీ మీద తెలుగు హీరోల కన్ను పడిందని.. అందునా అట్లీ.. ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్నాడనే న్యూస్ ప్రస్తుతం ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. మొన్నీమధ్యనే అట్లీ టాలీవుడ్ స్టార్ హీరోల్లో కొందరితో మీట్ అవగా.. అందులో ఎన్టీఆర్ మాత్రం అట్లీకి  కనెక్ట్ అయినట్లుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. 

ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ చేస్తున్న ఫ్యామిలీ స్టోరీ పూర్తి కాగానే.. రాజమౌళి మల్టీస్టారర్ లో చేయనున్నాడు. ఇక రాజమౌళి మల్టీస్టారర్ కి సమయం ఎంత పడుతుందో.. తెలియదు గాని.. ఆ సినిమా పూర్తి కాగానే.. ఎన్టీఆర్, అట్లీతో ఒక సినిమా చేస్తాడని... అంటున్నారు. ఇక అట్లీ కూడా ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులతో బిజీగా వున్నాడు. మరి త్వరలోనే అట్లీ - ఎన్టీఆర్ కాంబో వెండితెర మీద చూడాలని అప్పుడే ఎన్టీఆర్ ఫాన్స్ ఉవ్విల్లూరుతున్నారు.

Sponsored links

Atlee to direct Jr NTR? :

NTR With Mersel Director Atlee

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017