దాని కోసం కష్టపడుతూనే ఉంటా: భార్గవి!

Fri 18th May 2018 02:11 PM
bhargavi,serial actress,actress bhargavi,yendapelli bhargavi  దాని కోసం కష్టపడుతూనే ఉంటా: భార్గవి!
Actress Bhargavi About Movie Chances దాని కోసం కష్టపడుతూనే ఉంటా: భార్గవి!

మంచి నటిగా ప్రేక్షకులకు దగ్గర కావాలనేది నా కోరిక: భార్గవి 

ఆర్టిస్ట్‌గా బుల్లితెరపై ‘ప్రతిఘటన, ఋతుగీతం, కోయిలమ్మ, లక్ష్మీ కల్యాణం, మాటే మంత్రం’ వంటి సీరియల్స్‌‌తో పాటు వెండితెరపై ‘పెళ్లికి ముందు ప్రేమకథ’ అనే చిత్రంలో నటించిన నటి భార్గవి (ఎండపెల్లి భార్గవి). టీ.ఎఫ్.సి.సి యాంకర్‌గా ఎన్నో సినిమా ఫంక్షన్లకు, ఆడియో ఫంక్షన్లకు యాంకర్‌గా వ్యవహరించిన భార్గవి.. తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి నటిగా గుర్తింపు తెచ్చుకుంటూనే ఉన్నారు. 

తాజాగా ఆమె మాట్లాడుతూ.. టీవీ సీరియల్స్‌తో పాటు, సినిమాల్లోనూ మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. నటిగా మరిన్ని మంచి పాత్రలు చేసి ప్రేక్షకులకు దగ్గర కావాలనేది నా కోరిక. నాకు అవకాశాలు ఇస్తూ, నన్ను ప్రోత్సహిస్తున్న దర్శకనిర్మాతలకు, ఇతర నటీనటులకు నా ధన్యవాదాలు. నటిగా నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు నా వంతుగా కష్టపడుతూనే ఉంటాను. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా ధన్యవాదాలు.. అని తెలిపారు. 

Actress Bhargavi About Movie Chances:

Actress Bhargavi wants Good Chances 

Latest

Latest

Popular in Times

Contact us    Privacy     © 2017