Advertisement

పవన్‌ ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావడంలా!

Fri 27th Apr 2018 12:07 PM
pawan kalyan,media,fight,tweets  పవన్‌ ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావడంలా!
PAWAN KALYAN Security Fight with Media పవన్‌ ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావడంలా!
Advertisement

ఒకవైపు తనతల్లిని దూషించారని శ్రీరెడ్డి ఇష్యూ కాస్తా పవన్‌ పుణ్యమా అని యూటర్న్‌ తీసుకుని, పవన్‌ వర్సెస్‌ మీడియాగా మారింది. ఇక మీడియా అధినేతలైన టివి9 శ్రీనిరాజు, రవిప్రకాష్‌, ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి ఆర్కే, చంద్రబాబు, నారాలోకేష్‌ వంటి అందరి మీద పవన్‌ట్విట్స్‌తో మండిపడుతున్నాడు. మరోవైపు త్వరలో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో తాను పర్యటించనున్నానని చెబుతూనే తెలుగు సినీ పరిశ్రమలో నటీమణులకు సాదకబాధకాల కోసం ఉమెన్స్‌ వింగ్‌ని ఏర్పాటు చేయనున్నానని, పరిశ్రమలో ఆడపడుచుల ఆత్మగౌరవపోరాట సమితి ఏర్పాటుకి రంగం సిద్దం అవుతోంది. దీనికి జనసేన వీర మహిళా విభాగం అండగా ఉంటుంది అంటున్నాడు.  

ఇక అమెరికా రాజ్యాంగ పీఠిక మేము దేవుని నమ్ముతాం అని చెబుతుంది. టిడిపి రాజ్యంగ పీఠిక మాత్రం మేము తిట్టడాన్ని నమ్ముతాం అని చెబుతుంది. దేవుడ్ని తప్పఎవరినైనా తిడతాం అనేది టిడిపిసిద్దాంతం. ఇక తెలుగుదేశంలో తల్లిని, సోదరిని తిట్టే విభాగానికి ప్రధానకార్యదర్శి ఎవరంటే బూతు జ్యోతి రత్న ఆర్కేనే. గడచిన ఆరునెలలుగా నా మీద, నా అభిమానుల మీద, నా కార్యకర్తలపైన, నా తల్లి, కుటుంబం పైన భావద్వేగ అత్యాచారం చేస్తున్నారు. ఇలాంటి అనారోగ్య మనస్తత్వం ఉన్నవారు ప్రైవేట్‌గా తనకి సారీ చెబుతామని సంకేతాలు పంపుతున్నారు. బహిరంగంగా తిట్టి, ప్రైవేట్‌గా సారీ చెప్పడం నా దగ్గర నడవని పని... పాత్రికేయ విలువలతో ఉన్నమీడియా,చానెల్స్‌, సమదృష్టి కోణంలో ఉండే చానెల్స్‌, పత్రకలను మాత్రమే ప్రోత్సహించాలి. 

మనల్ని, మన తల్లులను, ఆడపడుచులను తిట్టే మీడియాను ఎందుకు చూడాలి.? వారి పేపర్లు, చానెల్స్‌ని ఎందుకు ఎంకరేజ్‌ చేయాలి? అంటూ ట్వీట్స్‌ వర్షం కురిపించాడు. మరోపక్క ఆయన త్వరలో జె టివి పేరుతో జనం కోసం అనే చానెల్‌ని పెట్టనున్నాడని, తానే సొంతా మీడియాను స్థాపించి నడిపించాలనే దిశగా ఆయన ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. మరి ఈయన ఈ మాటలన్నీనిజం అవుతాయా? లేక కామన్‌మెన్‌ ప్రొటెన్షన్‌ ఫోర్స్‌లా మద్యలోనే అటకెక్కుతాయా? అనేది వేచిచూడాల్సివుంది...! 

PAWAN KALYAN Security Fight with Media:

Jana Sena chief Pawan Kalyan takes to Twitter against media

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement