Advertisement

మరి అర్జున్‌రెడ్డి సంగతేంటి..?

Fri 20th Apr 2018 01:20 PM
pow sandhya,women organizations,sri reddy,ram gopal varma  మరి అర్జున్‌రెడ్డి సంగతేంటి..?
Sandhya Reacted on Ram Gopal Varma Suggestion to Sri Reddy మరి అర్జున్‌రెడ్డి సంగతేంటి..?
Advertisement

తాజాగా శ్రీరెడ్డి పవన్‌కళ్యాణ్‌ మీద చేసిన కామెంట్స్‌ ఎంతో దారుణంగా ఉన్నాయి. ఎంత కోపం వచ్చినా అలాంటి భాష మాట్లాడటం తప్పని అందరు ఏకగ్రీవంగా శ్రీరెడ్డిని దుయ్యబడుతున్నారు. అయినా ఆమె తనని తప్పుగా మాట్లాడిన వారి మీద అలాంటి కామెంట్స్‌ చేసినా ఓకే గానీ పోలీసులకు, న్యాయస్థానానికి వెళ్లమని సలహా ఇచ్చిందుకు పవన్‌ని, ఆయన తల్లిని జుగుప్సాకరంగా మాట్లాడటం సరికాదు. అయినా ఏకంగా అసెంబ్లీలోనే రోజా రెడ్డి వంటి వారు ఇలాగే బిహేవ్‌ చేయడం చూస్తే శ్రీరెడ్డి ఇలా మాట్లాడటంలో తప్పేమి లేదని అనిపిస్తోంది. ఇక ఆ మధ్య వచ్చిన 'అర్జున్‌రెడ్డి' చిత్రం వేడుక సమయంలో, ఆ చిత్రం హీరో విజయ్‌ దేవరకొండ అలాంటి తిట్టునే పదే పదే అక్కడి ఆడియన్స్‌ చేత అనిపించేలా చేసినప్పుడు ఈ పెద్ద మనుషులందరు ఎక్కడ ఉన్నారు? విజయ్‌దేవరకొండ తిడితే ఏదో పబ్లిసిటీ, అతని యూటిట్యూడ్‌ చూపించాడని ఫీలయిన ఇండస్ట్రీ పెద్దలు నేడు శ్రీరెడ్ది విషయంలో మాత్రం ఇంత పట్టుదలగా ఎందుకు ఉన్నారు? మరోవైపు విజయ్‌దేవరకొండ తన మాటలను తప్పు అని కూడా చాలా రోజులు ఒప్పుకోలేదు. కానీ శ్రీరెడ్డి మాత్రం పవన్‌ విషయంలో తప్పు చేశానని అంగీకరించింది. 

ఇక బాలకృష్ణ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి 'కడుపుచేయమన్నప్పుడు', చలపతిరావు 'ఆడాళ్లు పక్కలోకి పనికొస్తారని' వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ సినీ 'మా' పెద్దలు ఏం చేస్తున్నారు? ఇక శ్రీరెడ్డి విషయానికి వస్తే ఆమెకి పవన్‌ శత్రువైన ఓ దర్శకుడు పదే పదే మెసేజ్‌లు పంపాడని, వాటిని తాను చూశానని, వాటిని చూపించమని తను శ్రీరెడ్డిని అడిగితే ఆమె వాటిని తమకి పంపలేదని సామాజిక ఉద్యమకర్త సంధ్య తెలిపింది. ఇక తాజాగా శ్రీరెడ్డికి పవన్‌ని వివాదంలోకి లాగమని చెప్పింది తానేనని వర్మ కూడా ఒప్పుకున్నాడు. దాంతో శ్రీరెడ్డి బైఫోర్స్‌ వల్ల తనను ఆ మీడియా చానెల్‌ అలా మాట్లాడేందుకు రెచ్చగొట్టి తనని ఉచ్చులోకి దింపిందని అంటోంది. ఇక వర్మ మాట్లాడుతూ, ఈ విషయంలో సంధ్య, దేవి వంటి వారు అండగా ఉండాలని వర్మ తెలిపాడు. 

ఇక ఈ విషయంలో సంధ్య మాట్లాడుతూ, వర్మ తీసిన 'జీఎస్టీ' షార్ట్‌ ఫిల్మ్‌ విషయంలో మేమందరం ఉద్యమం చేశాం. ఆ పోరాటాన్ని నీరు గార్చేందుకు వర్మ ఇలా వ్యవహరిస్తున్నాడేమో అనే అనుమానాలను వ్యక్తం చేసింది. వర్మ తన 'జీఎస్టీ'ని యూరోప్‌లో తీశానని చెబుతున్నాడని, కానీ ఈ చిత్రం షూటింగ్‌ను కొంతభాగం పార్క్‌హయత్‌ హోటల్‌లోని పై అంతస్థులు, పూరీ జగన్నాథ్‌ ఆఫీసులో కూడా తీసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సంధ్య అంటోంది. మరి ఈ వివాదం రాబోయే రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందోవేచిచూడాల్సి వుంది...! 

Sandhya Reacted on Ram Gopal Varma Suggestion to Sri Reddy:

Women Organizations  fire on Arjun Reddy Dialogue 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement