Advertisement

అమ్మ, నాన్న, బాబాయ్‌ల రియాక్షన్ చాలు: చరణ్!

Sun 15th Apr 2018 09:07 PM
ram charan,rangasthalam,three people,reaction,success meet  అమ్మ, నాన్న, బాబాయ్‌ల రియాక్షన్ చాలు: చరణ్!
Ram Charan speech at Rangasthalam Success meet అమ్మ, నాన్న, బాబాయ్‌ల రియాక్షన్ చాలు: చరణ్!
Advertisement

'రంగస్థలం' చిత్రం పలువురిని విపరీతంగా ఆకర్షిస్తోంది. త్వరలో ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, హిందీ, భోజ్‌పురి భాషల్లో అనువాదం చేయాలని నిర్ణయించారు. ఇక ఈ చిత్రానికి హాలీవుడ్‌ బెస్ట్‌ ఫిల్మ్స్‌ కంటే మంచి రేటింగ్స్‌ వస్తున్నాయి.ఐఎండీబీ రేటింగుల్లో కూడా 'రంగస్థలం' టాప్‌ మూవీగా నిలిచింది. ఇక ఈ చిత్రాన్ని చూసిన అందరు సుకుమార్‌, రామ్‌చరణ్‌, సమంత, జగపతిబాబు, రత్నవేలు, దేవిశ్రీప్రసాద్‌లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా చూసిి బాబాయ్‌ పవన్‌కళ్యాణ్‌ రామ్‌చరణ్‌ నటనకు ఉప్పొంగి చరణ్‌ని కౌగిలించుకుని ముద్దు ఇచ్చాడు. ఇక చరణ్‌కి తాను బాబాయ్‌ కంటే ఓ అన్నయ్య వంటి వాడిని, నా అన్నావదినలు నాకు తల్లిదండ్రులు అని పవన్‌ చెబుతున్నాడు. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు నటన చూసి ఆయనకు చిరకాల వాంఛ అయిన బాలీవుడ్‌ అవకాశం కూడా వచ్చిందని జగపతిబాబు, ఇక తనకు పలు ఆఫర్స్‌ వస్తున్నాయని రంగమ్మత్తగా నటించిన అనసూయ చెబుతోంది. 

ఇక ఈ చిత్రం చూసిన తర్వాత తన తల్లిదండ్రులు ఉప్పొంగి పోయారని, తన తల్లి ఆనందభాష్పాలు రాలుస్తూ, నోట మాటలు రాలేదు. ఈచిత్రం చూసిన తర్వాత నా తల్లిదండ్రుల రియాక్షన్‌ మర్చిపోలేను. కన్నీళ్లతో అమ్మ నన్ను తన పక్కనే కూర్చొబెట్టుకుంది. ఆ సీన్‌ బాగుంది.. ఈ సీన్‌బాగుంది అనకుండా మొత్తం సినిమా చూసి ఆమె భావోద్వేగం చెందడం మర్చిపోలేను. పవన్‌కళ్యాణ్‌ బాబాయ్‌ ఆచిత్రం చూడలేదు. ఇంటికి వెళ్లి సినిమా చూడమని అడుగుదామని భావించాను. అంతలో బాబాయే నాకు ఫోన్‌ చేశారు. ఒకసారి ఇంటికి రా.. అని పిలిచారు. ఆయన అప్పటి దాకా సినిమా చూడలేదు. నాతో 'రంగస్థలం'లో అద్బుతంగా నటించావని అంటున్నారు అని ప్రశసించారు. మీ ఇంట్లో షో వేస్తాను బాబాయ్‌ అన్నాను. ఆయన నోచెప్పాడు. పోనీ ప్రీవ్యూ థియేటర్‌లో చూడు బాబాయ్‌ అన్నాను. కానీ ఆయన జనాల మధ్యలో చూడాలి. 'తొలిప్రేమ'ని సంధ్యా థియేటర్‌లో చూశాను.

ఆ తర్వాత నేను చూడబోయే ఈ చిత్రాన్ని కూడా ఆడియన్స్‌ మధ్యే చూస్తానని చెప్పడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.. ఈ రియాక్షన్స్‌ని మర్చిపోలేను అని రామ్‌చరణ్‌ చెప్పుకొచ్చాడు. నిజమే తన సినిమాల గురించి కూడా తాను మాట్లాడని పవన్‌కళ్యాణ్‌ 'రంగస్థలం'లో రామ్‌చరణ్‌ని ఏకంగా ఆకాశానికి ఎత్తేయడం సమంజసమేనని చెప్పాలి. 

Ram Charan speech at Rangasthalam Success meet:

I wasn't able to forget the reactions of three people (Dad, Mom, Babai) upon watching 'Rangasthalam' says Ram Charan.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement