Advertisement

అల్లు అర్జున్ జనసేన అనాలంటే..!

Wed 11th Apr 2018 03:11 PM
allu arjun,janasena,chiranjeevi,pawan kalyan,politics  అల్లు అర్జున్ జనసేన అనాలంటే..!
Bunny To Join Janasena, Conditions Apply! అల్లు అర్జున్ జనసేన అనాలంటే..!
Advertisement

బన్నీ తనకు తాను ముక్కుసూటి మనిషిని అనుకుంటాడు. కానీ నిజానికి నిజాయితీకి, ముక్కుసూటి తనానికి ఎంతో తేడా ఉంది. ఆయన 'సరైనోడు' వేడుకలో పవన్‌కళ్యాణ్‌ గురించి చెప్పను బ్రదర్‌ అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే లేపాయి. అయినా ఆ మాటపై ఆయన ఇప్పటికీ తప్పు చేశాననే భావన మాత్రం లేదు. ఇక ఈయన మెగా ఫ్యాన్స్‌లో కూడా గ్రూప్‌లు ఉన్నాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు. ఇక మెగా ఫ్యామిలీలో ఎందరో హీరోలు ఉన్నారు. వారికంటూ సొంతంగా కొంత ఫాలోయింగ్‌ కూడా ఉంటుంది. కాబట్టి కొన్నిచిన్న చిన్న విషయాలలో గొడవలు మామూలే. పవన్‌కళ్యాణ్‌ స్టార్‌గా మారిన తర్వాత చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ అభిమానుల మధ్య కూడా గొడవలొచ్చాయని, అవి తాత్కాలికమేనని తర్వాత కలిసిపోతూ ఉంటామని అన్నాడు. ఇక ఈయన తాజాగా రాజకీయాల విషయంలో తన స్టాండ్‌ని తెలిపాడు. రాజకీయాలలో నాకు ఏ స్టాండ్‌ లేదు. 

చిరంజీవి మామయ్య మనసులో ఏముందో తెలిస్తేనే నా స్టాండ్‌ ఏమిటో తెలుస్తుంది. మామయ్య చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉంటే నేను కూడా కాంగ్రెస్‌లోనే ఉంటాను. చిరు మామయ్య తన తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ పెట్టిన 'జనసేన'కి మద్దతు తెలిపితే నేను కూడా జనసేనకి మద్దతు తెలుపుతాను. నాకంటూ పొలిటికల్‌గా ఏస్టాండ్‌ లేదు. పెద్ద మామయ్య ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను. ఆయన దారిలోనే నడుస్తాను. ఆయన తప్ప నాకెవ్వరు ముఖ్యం కాదు. మామయ్య మాటే వేదంగా భావిస్తానని చెప్పుకొచ్చాడు. మరి గతంలో 'సరైనోడు' కి ముందు పవన్‌ ఫ్యాన్స్‌ బన్నీ మీద మండిపడటం చూసి చిరునే బన్నీని పిలిపించి సారీ చెబితే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పాడని, కానీ బన్నీ మొండి పట్టుదలతో కాదన్నాడని వార్తలు వచ్చాయి. మరి పెద్ద మామయ్యకి బన్నీ అంత విలువ ఇచ్చేటప్పుడు మామయ్య మాట వినకుండా ఎందుకు నో చెప్పాడని కొందరు పవన్‌ అభిమానులు మండిపడుతున్నారు. 

Bunny To Join Janasena, Conditions Apply!:

>Allu Arjun on Chiranjeevi, Pawan Kalyan's politics

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement