Advertisement

రంగస్థలంలో పృథ్వి సీన్స్ అందుకే తొలగించారా!

Fri 06th Apr 2018 07:56 PM
rangasthalam,prudhvi scenes,orayyo song,megastar chiranjeevi,sukumar  రంగస్థలంలో పృథ్వి సీన్స్ అందుకే తొలగించారా!
Sukumar Revealed The Story behind the Rangasthalam Orayyo song రంగస్థలంలో పృథ్వి సీన్స్ అందుకే తొలగించారా!
Advertisement

రంగస్థలం రన్ టైం బాగా ఎక్కువ. ఈమధ్యన సినిమాలన్నీ 2.30 గంటలకే దుకాణం సర్దేస్తుంటే సుకుమార్ మాత్రం రంగస్థలం రన్ టైం ని 2.50 నిమిషాల ఫిక్స్ చేసాడు. సినిమా హిట్ అవడంతో రన్ టైం విషయంలో పెద్దగా చర్చ జరగలేదుగాని.. అదేగనక సినిమా టాక్ బాగోపోతే అందరూ రన్ టైం వల్లే జరిగింది అంటారు. రంగస్థలం సెకండ్ హాఫ్ లో చాలా సీన్స్ ఎడిటింగ్ చెయ్యాల్సి ఉన్నా రంగస్థలం టీమ్ మాత్రం అన్ని సీన్స్ అలానే ఉంచేసి సినిమా నిడివి పెంచేసింది. అయితే రంగస్థలం క్లైమాక్స్ కి ముందు వచ్చే 'ఓరయ్యో...' అనే సాంగ్‌ ని ముందుగా... ప్రేక్షకులని ఎమోషన్‌కి గురి చేస్తుందని తీసేద్దామని డిసైడ్ అయ్యారట. 

సినిమా నిడివి ఎక్కువగా ఉండడంతో ఆ పాటని తీసేస్తే బావుంటుందని నిర్మాతలు అనుకున్నారట. ఇక వారు సుకుమార్ కి చరణ్ కి అలాగే టెక్నీకల్ టీమ్ కి కూడా చెప్పి కన్విన్స్ చేసి పాటను లేపేద్దామనుకున్నారట. అయితే చివరిలో సుకుమార్ మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా సంప్రదించి ఆ పాట లేపేద్దామనుకుని చిరు వద్దకి వెళ్లి ఆ పాట వినిపిస్తే... చిరు ఆ పాటతో బాగా ఎమోషన్ గా ఫీల్ అయ్యి... ఈ పాటని తీసెయ్యొద్దని...  అసలు చిట్టిబాబు అన్న కుమార్ బాబు ఉరఫ్ ఆది పినిశెట్టి చనిపోయిన ముందు సీన్ గాని, వెనుక సీన్ గాని తొలిగించొద్దని... సూచించాడట. అయితే ఆ పాటకు బదులు మరో పది నిమిషాల సీన్స్ తొలిగించమని చిరు చెప్పాడట. ఈ విషయం సుకుమార్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. 

మరి అందులో భాగంగా కమెడియన్ పృథ్వి సీన్స్ తొలిగించి ఉంటారు. ఎందుకంటే గత నాలుగైదు రోజులుగా కమెడియన్ పృథ్వి సీన్స్ ని రంగస్థలం నుండి తొలగించినట్లుగా ప్రచారం జరుగుతుంది. అందుకే చిరు చెప్పిన ఆ కామెడీ సీన్స్ తీసేసి ఆ ఎమోషనల్ గా ఉన్న పాటని ఉంచేశారట. మరి ఆ పాట అడియన్స్ కి ఎంత బాగా కనెక్ట్ అయ్యిందో.. అందరికి తెలిసిన విషయమే. మరి మెగాస్టార్ జడ్జ్మెంట్ బాగా పనిచేసింది కదా. అలాంటి డెసిషన్స్ చిరు  కరెక్ట్ గా తీసుకోబట్టే ఆయన మెగాస్టార్ అయ్యాడంటున్నారు.

Sukumar Revealed The Story behind the Rangasthalam Orayyo song:

Top Reason behind Prudhvi Raj Scenes Removed from Rangasthalam

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement