Advertisement

రంగస్థలంలో కూడా రాజకీయాలే..!

Sat 17th Feb 2018 07:49 PM
ram charan,rangasthalam,politics,sukumar,dsp  రంగస్థలంలో కూడా రాజకీయాలే..!
Politics in Rangasthalam Movie రంగస్థలంలో కూడా రాజకీయాలే..!
Advertisement

రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసి రికార్డు సృష్టిస్తుందో తెలియదు కానీ. అసలు సినిమా ఎలా ఉంటుందో అని అందరి మదిలో మొదులుతోన్న ఒకే ఒక్క సందేహం. సినిమా కాన్సెప్ట్ ఏంటి అనే విషయంపై ప్రస్తుతం చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మొదటి నుండి ఈ సినిమా ప్యూర్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో.. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన సినిమా అని అనుకుంటున్నారు. ఇందులో చరణ్ సౌండ్ ఇంజనీర్ పాత్రలో నటిస్తున్నాడు. సమంత పేదింటి పిల్లగా కనిపించడం.. వీరిద్దరి మధ్య సరదాగా ఉండటం వంటి సన్నివేశాలు సినిమాలో హైలెట్ కానున్నాయని టాక్ కూడా బాగానే వచ్చింది. అయితే వీటితో పాటు పాలిటిక్స్ ఫ్లేవర్ ను జోడించనున్నాడు సుకుమార్.

సుకుమార్ ఇప్పటి వరకు పాలిటిక్స్ ని టచ్ చేయలేదు. మొదటిసారి ఈ సినిమాలో చూపించబోతున్నాడట. 1980 నాటి కాలానికి తగ్గటుగా ఉండే మండల్ ఎలక్షన్స్ ఉంటాయట. అందుకు సంబందించిన సన్నివేశాల్లో సుకుమార్ సృజనాత్మకత చాలానే ఉంటుందని తెలుస్తోంది. ఆ సీన్స్ అప్పుడు దేవి శ్రీ సంగీతం ఉత్కంఠను రేపెలా చేస్తుందట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ కొన్ని సన్నివేశాలు విజిల్స్ వేయించడం పక్కా అని సమాచారం. మరి నిజమేదో తెలియాలంటే మార్చి 30 వరకు ఆగాల్సిందే.

Politics in Rangasthalam Movie:

Ram Charan's Rangasthalam is all about POLITICS

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement