'జై సింహా' టోటల్ కలెక్షన్స్ ఇంతేనా!

Thu 15th Feb 2018 01:44 PM
balakrishna,jai simha,collections,closing  'జై సింహా' టోటల్ కలెక్షన్స్ ఇంతేనా!
Jai Simha Closing Collections 'జై సింహా' టోటల్ కలెక్షన్స్ ఇంతేనా!

పోయిన ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాల మధ్య ఎంత పోటీ ఉందో.... అదేవిధంగా ఈ సంక్రాంతికి కూడా ఖచ్చితంగా పోటీ ఉంటుంది అనుకున్నారు అంత. కానీ 'అజ్ఞాతవాసి' డిజాస్టర్ వల్ల ఈ పోటీ చప్పపడిపోయింది. విడుదల అయిన మూడు స్ట్రెయిట్ సినిమాల్లో బాలయ్య సినిమా 'జై సింహా' పర్లేదు అనిపించుకుంది.

ఈ 'జై సింహా' సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రన్ దాదాపు పూర్తయిపోయింది. ఇప్పటి దాకా 35.86 కోట్ల షేర్ తో సేఫ్ అనిపించాడు బాలయ్య. ఈ సినిమా బిజినెస్ ప్రకారం సుమారు 28 కోట్లకు అమ్ముడైంది. 8 కోట్ల లాభంతో మరోసారి బాలయ్య సెంటిమెంట్ వర్క్ అవుట్ అయింది.

కానీ ఇది బాలయ్య స్టామినాకి తగ్గ సినిమా కాదు. ఎందుకంటే గత ఏడాది గౌతమిపుత్ర శాతకర్ణి 70 కోట్లకు పైగా గ్రాస్ సాధించి కొత్త రికార్డు సెట్ చేసింది. కానీ జై సింహా మాత్రం 36 కోట్లు మాత్రమే వసూల్ చేసింది. విన్నర్ అని చెప్పుకుంటున్న బాలయ్య స్టామినాకు తగ్గ సక్సెస్ మాత్రం జైసింహా ఇవ్వలేదు.

Jai Simha Closing Collections :

This Is The Balayya Stamina

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017