Advertisement

2 సూపర్‌హిట్‌ చిత్రాలను మిస్సయింది..!

Tue 23rd Jan 2018 11:30 AM
parvathy nair,rejected,shalini pandey,role arjun reddy  2 సూపర్‌హిట్‌ చిత్రాలను మిస్సయింది..!
Parvathy Nair Rejected 2 Super Hit Movies 2 సూపర్‌హిట్‌ చిత్రాలను మిస్సయింది..!
Advertisement

సాధారణంగా సినిమా ఫీల్డ్‌లో ముందుగా ఒక హీరో, లేదా హీరోయిన్‌ని అనుకోవడం, వాటికి వారు నో చెబితే పక్కవారికి వెళ్తూంటాయి. ఇక ఈ చిత్రాలు విడుదలై ఘనవిజయం సాధిస్తే ముందుగా నో అని చెప్పినవారు ఎంతగా బాధపడతారో అర్ధమవుతుంది. అందుకే పాత్రల, కథ ఎంపికలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే మంచి చిత్రాలను పోగొట్టుకుని జీవితాంతం బాధపడాల్సివస్తుంది.

ఇక విషయానికి వస్తే కిందటి ఏడాది పెద్దగా పేరులేని విజయ్‌దేవరకొండ, కొత్త దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాల కాంబినేషన్‌లో వచ్చిన 'అర్జున్‌రెడ్డి' చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలోని తన పాత్ర పవర్‌ని విజయ్‌ దేవరకొండ గుర్తించి తన పాత్ర కోసం కేవలం డార్క్‌ మూవీస్‌నే చూడటం నుంచి తన గెటప్‌, బాడీ లాంగ్వేజ్‌ని మార్చుకున్నాడు. విడుదలైన తర్వాత దీని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా, విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌గా ఎంతో బోల్డ్‌గా నటించిన హీరోయిన్‌ షాలిని పాండేలకి తెలుగులో ఓవర్‌నైట్‌ స్టార్‌ డమ్‌ వచ్చింది. ఈ చిత్రం ద్వారా షాలిని పాండేకి తమిళంతో పాటు తెలుగులోనూ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఈ చిత్రంలో మొదట షాలిని పాండే బదులు తమిళనటి పార్వతినాయర్‌ని అనుకున్నారట. దర్శకుడు ఆమెకి కథను చెప్పడంతో పాటు బైండెడ్‌ స్క్రిప్ట్‌ని కూడా ఇచ్చాడట. కానీ ఈ కథ విన్నప్పుడు చదివినప్పుడు ఎంతో సాదాసీదాగా అనిపించింది. పైగా విజయ్‌ దేవరకొండ, సందీప్‌రెడ్డి వంగా ఇద్దరు పెద్దగా పేరు, అనుభవం లేనివారు. ఇక ఈ చిత్రంలోని లిప్‌లాక్‌ సీన్స్‌, ఇతర బోల్డ్‌ సీన్స్‌లో నటించడం నాకు ఇష్టం లేదు దాంతో ఈ చిత్రానికి నో చెప్పాను. ఈ సినిమాని తెరపై చూసినప్పుడు మంచి సినిమాను వదులుకున్నానని బాధపడ్డాను. ఇక తమిళంలో వచ్చిన 'అరువి' చిత్రం కూడా నా వద్దకే వచ్చింది. సినిమా కథకి అనుగుణంగా గుండుతో కనిపించాలి. గుండు కొట్టించుకోవాలి అని చెప్పడంతో నేను చేయలేదు. ఇలా రెండు మంచి అవకాశాలు పోగొట్టుకున్నానని పార్వతి నాయర్‌ తన బాధనంతా చెప్పుకొచ్చింది.

Parvathy Nair Rejected 2 Super Hit Movies:

Parvathy Nair REJECTED Shalini Pandey’s role in Arjun Reddy

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement