Advertisement

పవన్‌ మౌనం వెనుక అర్ధం ఏమిటి?

Sat 20th Jan 2018 08:04 PM
pawan kalyan,silent,not answer,kathi mahesh,controversy  పవన్‌ మౌనం వెనుక అర్ధం ఏమిటి?
What is the Pawan Kalyan Stand in Kathi Issue? పవన్‌ మౌనం వెనుక అర్ధం ఏమిటి?
Advertisement

బహుశా పవన్‌కి, ఆయన అభిమానులకు తెలియదేమో గానీ సినిమాలలో దేవుడిగా కొలిచి 'అందరివాడు' అనిపించుకున్న నాటి ఎన్టీఆర్‌కే వ్యతిరేకంగా సూపర్‌స్టార్‌ కృష్ణ ధ్వజమెత్తాడు. ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నా కూడా ఎన్టీఆర్‌ని లెక్కచేయకుండా ఆయనపై 'మండలాధీశుదు, గండి పేట రహస్యం' వంటి వ్యంగ్యాస్త్రాలను సంధించాడు. ఇక ఎన్టీఆర్‌ అంటే ప్రాణం ఇచ్చే కైకాల సత్యనారాయణ వంటి వారు కూడా ఎన్టీఆర్‌ తరహా వేషధారణతో 'సాహసమే నా ఊపిరి' వంటి చిత్రాలలో వ్యంగ్యంగా.. మా దగ్గరేముంది బూడిద అంటూ కాషాయ వస్త్రాలలో కనిపించి, నటించారు. చివరకు ఇది ఎంత దూరం వెళ్లిందంటే కృష్ణ ఓ రాజకీయ సభలో ప్రసగించేటప్పుడు ఆయనపై రాళ్లు వేసి ఆయన ఒక కన్ను సరిగా కనిపించడానికి లేని విధంగా ప్రమాదం జరిగింది.

ఇక చిరంజీవి అంటే అందరివాడుగా సినిమాలో రాజ్యమేలిన వ్యక్తి రాజకీయాలలోకి వస్తే రోజా చిరంజీవిని, పవన్‌కళ్యాణ్‌ని ఉద్దేశించి, నెల్లూరులో జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో 'నన్ను లం.. అని తిడుతున్నారు. నేను ఎందరి పక్కనో పడుకుని వచ్చిన హీరోయిన్‌ని అని మెగాఫ్యాన్స్‌ అంటున్నారు. మరి ఆ లెక్కన పవన్‌ కల్యాణ్‌ భార్య( నాటి) రేణుదేశాయ్‌ కూడా సినిమా నటే కదా...! మరి ఆమె ఎందరి పక్కల్లో పడుకుందో చెప్పమనండి' అని మీడియా ఎదుటే నోరు విప్పింది. ఇక బాలకృష్ణ మీద హీరోయిన్‌గా ఉన్నప్పుడు గొప్పగా మాట్లాడిన రోజా నంద్యాల ఉప ఎన్నికల సభలో ఫ్యాన్‌ గాలికి బాలయ్య విగ్గు ఎగిరిపోయిందని ఎద్దేవా చేసింది. ఇక విజయశాంతి రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఆమె పరిస్థితి దీనంగా మారింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నోఉదాహరణలు ఉన్నాయి.

జయలలిత వంటి నటి, రాజకీయ నాయకురాలిని అసెంబ్లీలో వివస్త్రను చేశారు. నేటి రాజకీయాల గురించి నాయకుల పోకడల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక సినిమా అనేది ప్రైవేట్‌ వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం. ఈ విషయంలో మా సినిమా మా ఇష్టం వచ్చినట్లు తీస్తాం.. ఇష్టం ఉంటే చూడండి. లేదంటే లేదు అనే పరిస్థితి రాజకీయాలలో ఉండదు. ఒక్కసారి ప్రజా క్షేతంలోకి అడుగుపెట్టిన తర్వాత వ్యక్తిగత విమర్శలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. మోడీ భార్య విషయం కాంగ్రెస్‌ పార్టీ టార్గెట్‌ చేస్తే నాటి మొదటి మన దేశ ప్రధాని నెహ్రూ నాటి మహిళలతో క్లోజ్‌గా ఉన్న ఫొటోలను, వీడియోలను బిజెపి బయటికి తీసింది. కాబట్టి కేవలం పొగడ్తలే వింటూ.. అందరూ మీరే మెగాస్టార్‌, పవన్‌ స్టార్స్‌ అని పొగిడే వారి మీద పొలిటికల్‌లో మాత్రం తీవ్ర విమర్శలు వస్తాయి. వాటికి వివరణ ఇవ్వడమో, ఖండించడమో చేయాలి కానీ భౌతిక దాడులకు పాల్పడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది.

నాడు ప్రజారాజ్యం సమయంలో కూడా రాజశేఖర్‌.. చిరుని సపోర్ట్‌ చేయను అన్న తర్వాత రాజశేఖర్‌పై జరిగిన దాడి, ఇప్పుడే ఇలా ఉంటే అధికారంలోకి వస్తే ఆయన పార్టీ వారు ఏమి చేస్తారో అనేంత భయోత్పాతాన్ని కలిగించింది. ఇక స్వయాన నాడు పిఆర్పీ టికెట్‌ మీద చిలకలూరి పేటలో నిలుచున్న పోసాని తాను ఆ ఎన్నికల్లో ప్రచారంకి వెళ్లినప్పుడు ఓ మహిళ ఇంట్లోకి ఆహ్వానించి కాఫీ ఇచ్చి ఈ కాపులు అధికారంలోకి వస్తే మనల్ని బతకనీయరు. నీవు మంచి వాడివైనా నీకు ఓటు వేయను అని చెప్పిన సంగతిని పోసానే ఇటీవల బయటపెట్టాడు. అంతలా నాడు కాపు రంగు , ఆయన అభిమానుల తీరు ఆయన పార్టీకి తీవ్ర నష్టం చేశాయి. తర్వాత చంద్రబాబు సైతం పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంపై సెటైర్లు వేశాడు.

ఇక ఇప్పుడు పవన్‌ వంతు వచ్చింది. పవన్‌ వ్యక్తిగతం, ఉదయ్‌కిరణ్‌ నిశ్చితార్థంలో ఆయన మీడియాపై చేయిచేసుకున్న సంగతి. ఆయన సొంత వ్యవహారం అయిన మూడు పెళ్లిళ్ల సంగతి ఎవ్వరూ పట్టించుకోకుండా నాకు కులం లేదు.. మతం లేదు.. పవర్‌ పాలిటిక్స్‌ వద్దు అని చెప్పిన పవన్‌ భావాలకు తటస్థ వ్యక్తులు కూడా హర్షించారు. కానీ నేడు పవన్‌ తన ఫ్యాన్స్‌ విషయంలో మౌనంగా ఉండటం. సినిమా బాగాలేదని విమర్శించిన వ్యక్తిపై దాడి చేయడం చూస్తుంటే. దానిపై పవన్‌ కనీసం మాట్లాడలేని స్థితిని గమనిస్తే బహుశా పవన్‌ చెప్పే ఆశయాలు, ఆయన మేనిఫెస్టో, ఆయన మాట్లాడే పవనిజం అంటే ఇలా రౌడీయిజమేనా అనే సందేహం వస్తోంది. ఇలాంటి అభిమానుల విపరీత పోకడలున్న వారికి ఓ సలాం చెప్పాలని అనిపిస్తోంది.

మరోవైపు పవన్‌ తన అన్నయ్య పీఆర్పీని మోసం చేసిన వారి అంతుచూడటానికే వచ్చానన్న స్టేట్‌మెంట్‌ కూడా ఆయనకు మైనస్‌గా మారుతోంది. ఇలాగైతే పవన్‌ కళ్యాణ్‌ కూడా చిరులా ఏకాకి అవుతాడు. నేడు కత్తి మహేష్‌ ఒక్కడే కాబట్టి ఆయన్ను బెదిరించగలరు. కానీ భవిష్యత్తులో ఈ పోకడలకు వ్యతిరేకంగా లక్షల గొంతులకు, ప్రజాసంఘాలు, మానవసంఘాలు, మేధావులు, విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామ్యం కోరుకునే అందరూ ఎవరో ఒకరి అండతో పవన్‌ని అంటరాని వాడుగా చూసే ప్రమాదం మాత్రం ఉంది. అన్నింటికీ మౌనమే సమాధానం అనుకోవడానికి వీలు లేదు.

నేడు పవన్‌ ఫ్యాన్స్‌ని వెనకేసుకువస్తున్న వారందరూ పవన్‌ అభిమానులను, ఆయన ఇమేజ్‌ని క్యాష్‌ చేసుకోవడానికి, ఆయన నుంచి సినిమా అవకాశాలు, రాజకీయ లబ్ది కోసం చేస్తున్నారు. వీరే పవన్‌ పాలిట నిజమైన విలన్లు. రాజకీయాలలో హత్యలు ఉండవు కేవలం ఆతహత్యలే ఉంటాయని, శత్రువులు బయట కాదు. తమ వెన్నంటే ఉంటారని, సమయానికి వాడుకుని జెండా పీకుతారని పవన్‌, ఆయన అభిమానులు గుర్తించలేకపోతే అది ఆయన, ఆయన అభిమానులకు ఆత్మహత్య సదృశ్యం కావడం ఖాయంగా చెప్పవచ్చు...!

What is the Pawan Kalyan Stand in Kathi Issue?:

Pawan Kalyan silent is not Answer to Kathi Controversy 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement