Advertisement

నాలుగు సినిమాలు.. థియేటర్స్ ఏవి?

Tue 09th Jan 2018 10:43 PM
agnathavasi,gand,jai simha,rangula ratnam,sankranthi,theaters war  నాలుగు సినిమాలు.. థియేటర్స్ ఏవి?
Theaters War Between Sankranthi Release Movies నాలుగు సినిమాలు.. థియేటర్స్ ఏవి?
Advertisement

గత ఏడాది సంక్రాంతికి సినిమాల మధ్య పోటీ ఉన్నట్టు... ఈ ఏడాది కూడా అటువంటి పోటీ ఉంటుందనుకున్నారు. అన్నట్లుగానే ఈ సంక్రాంతికి ముందు నుండే ‘అజ్ఞాతవాసి’.. బాలయ్య మూవీ ‘జై సింహా’ మాత్రమే కన్ఫమ్ అయ్యాయి. తెలుగులో ఈ సినిమాలు తప్ప మరొక్క సినిమా లేదు. తమిళ్ సినిమా 'గ్యాంగ్' కూడా సంక్రాంతికే షెడ్యూల్ అయినప్పటికీ.. పండగలకు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేయకూడదనే షరతు ఉన్న నేపథ్యంలో దీని విడుదల ఆగిపోతుందేమో అనుకున్నారు.

కానీ సీన్ మారింది. 'గ్యాంగ్' సినిమా కూడా సంక్రాంతి రేస్ లోకి దూసుకొచ్చింది. ఈ సినిమా తెలుగు రైట్స్ తీసుకుంది యువి క్రియేషన్స్. ఈ సంస్థ వెనక అల్లు అరవింద్ లాంటి మరో పెద్ద నిర్మాత ఈ చిత్రానికి అండగా నిలుస్తున్నారు. వాళ్లిద్దరూ కలిసి ఈ సినిమాకు థియేటర్స్ సాధించే పనిలో ఉన్నారట.

మరోవైపు అక్కినేని నాగార్జున నిర్మించిన 'రంగుల రాట్నం' సినిమాను సడన్ గా రేస్ లోకి తీసుకొచ్చాడు. తెలుగు రాష్ట్రాలలో నాగార్జున పట్టు ఉంది కాబట్టి.. తన పరిచయాలతో మరిన్ని స్క్రీన్లు సంపాదించే పనిలో పడ్డాడు. మరి ఒకేసారి మూడు తెలుగు సినిమాలు.. ఒకటి తమిళ్ సినిమా వస్తుంది కాబట్టి.. ఎవరి స్థాయిలో వాళ్లు థియేటర్ల కోసం గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నారు. మరి వీరిలో ఎవరు ఎంత మేరకు సక్సెస్ అవుతారో.. సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

Theaters War Between Sankranthi Release Movies:

3 Straight Movies and 1 Dubbed Movie Releases to Sankranthi

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement