Advertisement

రోజాపై కౌంటర్‌ వేయడానికి తెస్తున్నారు!

Fri 17th Nov 2017 11:08 PM
tdp,roja,jeevitha,vani viswanath,chandrababu naidu,ysrcp  రోజాపై కౌంటర్‌ వేయడానికి తెస్తున్నారు!
Roja Talks About Vani Viswanath TDP Entry రోజాపై కౌంటర్‌ వేయడానికి తెస్తున్నారు!
Advertisement

వైసీపీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న మహిళానేత రోజా అనే చెప్పాలి. ఈమె వైసీపీ తరపున ప్రస్తుతం నగరి నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికైంది. కాగా గత కొన్ని రోజులుగా మరో సీనియర్‌ సినీనటి వాణివిశ్వనాథ్‌ టిడిపిలోకి వస్తానని చెబుతోంది. రోజా తనకు పోటీయే కాదని, పది మంది రోజాలు ఉన్నా ఎదుర్కొగల సత్తా తనకి ఉందని, ఇక నగరి నుంచి రోజాపై పోటీగా నిలబడేందుకు సిద్దమని చెబుతూనే అదంతా చంద్రబాబునాయుడు గారు చూసుకుంటారని చెప్పింది. దీనిపై తాజాగా రోజా స్పందించింది. 

నాకు వాణివిశ్వనాథ్‌ పోటీయా? నేను అలా భావించడం లేదు. నేను రాజకీయంగా ఎన్నో పోరాటాలు చేసి పైకి వచ్చాను. రాజకీయాలలోకి వస్తేనే పాలిటిక్స్‌ అంటే ఏమిటో అర్ధమవుతాయి? అంటూ వాణీవిశ్వనాథ్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. నేను ఎంతో కష్టపడి ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాను. టిడిపి అధికార పార్టీ కావడంతోనే దానిలో చేరడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారని వ్యాఖ్యానించింది. మరో వైపు కేరళ అమ్మాయి అయిన వాణివిశ్వనాథ్‌కి సరిగా తెలుగులో మాట్లాడటమే రాదు. దాంతో పాటు గ్లామర్‌ కోసం ప్రయత్నిస్తున్నామనుకునే అభిప్రాయం రావచ్చని సంశయిస్తున్నాడు. అయితే వాణివిశ్వనాథ్‌కి టిడిపిలో చేరినా ఆమెకు టిక్కెట్‌ ఇవ్వడం అనుమానస్పదమే. 

కాగా తాజాగా జీవిత టిడిపిలో చేరికపై కామెంట్స్‌ చేసింది. మొదట లక్ష్మిపార్వతికి, ఎన్టీఆర్‌కి మద్దతు తెలిపి, తర్వాత చంద్రబాబు పంచన చేరి, తర్వాత బిజెపి, మరలా వైసీపీలోకి వచ్చి తాజాగా బిజెపిలో ఉండి పోవడంతో ఆమెకు సెన్సార్‌బోర్డ్‌ కమిటీ సభ్యురాలిగా, నంది అవార్డ్సులో స్థానం వంటివన్నీ ఇస్తున్నారు. ఇక దీంతో ఈమద్య ఆమె చంద్రబాబుని విపరీతంగా పొగిడింది. తాజాగా మీరు తెలుగు దేశంలో చేరుతారా? అంటే పిలిస్తే ఖచ్చితంగా వెళ్తామని కామెంట్‌ చేసింది. ఈ నేపధ్యంలో రాజశేఖర్‌కి సరైన వాయిస్‌, అనర్గళ ఉపన్యాసాలు చేతకాకపోయినా జీవిత మాత్రం ఇందులో బాగా ముదురే. ఆమె ఎవరినైనా తన మాటలతో చీల్చిచెండాడుతుంది. 

మరోవైపు పొడగమంటే రోజా స్థాయిలో మాట్లాడగలదు. సో.. త్వరలో జీవితను టిడిపిలో చేర్పించి, వాణివిశ్వనాథ్‌ కంటే జీవితనే బెటర్‌ అనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చాడని అంటున్నారు. ఇక తాజాగా రోజా దేశ చరిత్రలో దొడ్డిదారిన మంత్రి అయిన ముఖ్యమంత్రి కొడుకు లోకేషేనని, ఆయన వచ్చినప్పటి నుంచే అనర్ధాలు వస్తున్నాయని వ్యాఖ్యానించింది. మరి వైసీపీ తరపున ఉన్న రాజ్యసభ, శాసనమండలి సభ్యులు కూడా దొడ్డిదారినే వచ్చిన సంగతి ఆమె మరిచింది. రాజకీయాలలోకి రావాలంటే ప్రజల్లో తిరిగిన వారికే ప్రజాకష్టాలు తెలుస్తాయని తేల్చింది. 

Roja Talks About Vani Viswanath TDP Entry:

TDP Searching for Counter Person on Roja

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement