Advertisement

ఇది నిజమైతే.. రామ్ చరణ్ చాలా చాలా గ్రేట్!

Fri 10th Nov 2017 01:18 PM
ram charan,rangasthalam 1985,mega power star,sukumar,mythri movie makers  ఇది నిజమైతే.. రామ్ చరణ్ చాలా చాలా గ్రేట్!
Ram Charan Great Decision For Rangasthalam 1985 ఇది నిజమైతే.. రామ్ చరణ్ చాలా చాలా గ్రేట్!
Advertisement

భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలేమన్న కలెక్షన్స్ పరంగా తేడా కొడితే... అందులో నటించిన హీరోస్ వాళ్ళ రెమ్యూనరేషన్ నుండి కొంత డబ్బు తిరిగి ఇచ్చేస్తారు. బ్రహ్మోత్సవం టైం లో మహేష్ కూడా అదే చేశాడు. డిస్ట్రిబ్యూటర్స్ లాస్ అవకూడదని ఆలా చేశాడు మహేష్. అంతేకాకుండా మొన్న వచ్చిన స్పైడర్ విషయంలో కూడా అదే జరిగింది. అయితే రామ్ చరణ్ కూడా గోవిందుడు అందరివాడేలే సినిమా టైమ్‌ నుంచి తన చిత్రాలకి అవుతోన్న ఖర్చుని చరణ్‌ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నాడు. ఓవర్ బడ్జెట్‌ అయితే... సినిమా ఫలితం తేడా కొడితే తన పారితోషికంలో తిరిగి ఇవ్వడం లేదా బ్యాలెన్స్‌ అమౌంట్‌ తీసుకోకపోవడం చేస్తూ వస్తున్నాడు.

ప్రస్తుతం రామ్ చరణ్.. సుకుమార్ డైరెక్షన్ లో 'రంగస్థలం 1985' చేస్తున్న సంగతి తెలిసిందే. 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్‌' లాంటి హిట్‌ సినిమాలు తీసిన మైత్రి మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకి అయ్యే ఖర్చు ఎస్టిమేట్‌ వేసిన దానికన్నా లెక్క దాటితే రామ్ చరణ్ తన పారితోషికంలో నుండి తగ్గిస్తున్నాడట.

అయితే ఈ చిత్రం మొదట కోనసీమలో తీద్దామని అనుకున్నారు.. కానీ అక్కడ జనాల మధ్య స్టార్‌ హీరో సినిమా షూటింగ్‌ సజావుగా సాగకపోవడంతో హైదరాబాద్ లో సెట్ వేసి తీస్తున్నారు. ఈ సెట్ కోసం అయిదారు కోట్లు ఖర్చు అయిందట. ఈ భారం నిర్మాతపై పడకుండా తన పారితోషికంలో తగ్గించుకోవడమే కాకుండా దర్శకుడు సుకుమార్‌ని కూడా రెమ్యూనరేషన్‌ తగ్గించుకోవాలని అడిగాడట రామ్ చరణ్. చరణ్ అడిగాక సుకుమార్ కాదనలేక తన రెమ్యూనరేషన్‌ లో నుండి ముప్పై శాతం తగ్గించుకున్నాడని వినికిడి. ఏదిఏమైనా రామ్ చరణ్ ది గొప్ప మనసు అని చెప్పుకోవాలి.

Ram Charan Great Decision For Rangasthalam 1985 :

Ram Charan Cuts His Remuneration For Rangasthalam Movie 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement