Advertisement

'నేనే రాజు ..మంత్రి' నేనే చేయాల్సింది: రాజశేఖర్!

Wed 01st Nov 2017 04:29 PM
nene raju nene manthri,raja sekhar,rana,teja,climax  'నేనే రాజు ..మంత్రి' నేనే చేయాల్సింది: రాజశేఖర్!
Rajasekhar Clarity on Nene Raju Nene Mantri Chance 'నేనే రాజు ..మంత్రి' నేనే చేయాల్సింది: రాజశేఖర్!
Advertisement

సినిమాలోని పాత్రలను పాత్రలుగా చూడాల్సిందే. 'సాగరసంగమం' క్లైమాక్స్‌లో కమల్‌హాసన్‌ చనిపోకపోతే ఆ చిత్రానికి విలువేలేదు. ఇలాంటి చిత్రాల విషయంలో ఖచ్చితంగా హీరోల కంటే దర్శకులకే ఎక్కువ విజన్‌ ఉంటుంది. బాలీవుడ్‌, కోలీవుడ్‌లలో స్టార్స్‌ కూడా విలన్‌ పాత్రలు చేస్తారు. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌తో పాటు విక్రమ్‌, సూర్య వంటి వారు కూడా కథానుసారం చేయాల్సిందే. అలా చేయకుండా క్లైమాక్స్‌నే హీరోలు మార్చేయడం దర్శకుల గౌరవాన్ని కించపరిచే విషయమే అవుతుంది. ఇక ఇప్పుడు తెలుగులో కూడా ఈ ట్రెండ్‌ నడుస్తోంది. ఎంతటి స్టార్స్‌ చిత్రాలైనా వైవిధ్యంగా లేకపోతే ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. హీరో పాత్రల్లో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్నా,కథ మేరకు హీరోలు చనిపోవాల్సి ఉన్నా, గుడ్డివాడిగా కనిపించినా, 'జై' పాత్ర తరహాలో నెగటివ్‌షేడ్స్‌ ఉన్నా ప్రేక్షకులు వాటిని పట్టించుకోకుండా సినిమా కంటెంట్‌కి, వైవిధ్యభరితమైన స్క్రీన్‌ప్లేకి ఓటు వేస్తున్నారు. 

నాడు 'ప్రేమాభిషేకం'లో ఏయన్నార్‌ క్యాన్సర్‌ వ్యాధితో చనిపోవడంలోనే అసలు కథంతా మిళితమై ఉంది. కానీ కొందరు సోకాల్డ్‌ స్టార్స్‌గా చెప్పుకునే వారు విలన్‌ చేత ఒక్క దెబ్బతినకూడడు.. కొడితే గాలిలో వందమంది రౌడీలైనా పల్టీ కొట్టాలి.. చిటికేస్తే కుర్చీలు దగ్గరకు రావాలి.. కను చూపుతో రైళ్లు ఆగిపోవాలి.. అనే చిత్రాలను చూసే కాలం పోయింది. నేచురాలిటీకి ప్రజలు బాగా కనెక్ట్‌ అవుతున్నారు. ఇక తేజని మరలా వెలుగులోకి తెచ్చి పూర్వ వైభవం కంటే ఎక్కువగా.. వెంకటేష్‌ చిత్రంతోపాటు, ప్రతిష్టాత్మకమైన బాలయ్యాస్‌ ఎన్టీఆర్‌ బయోపిక్‌ని అందించిన చిత్రం ఆయన తీసిన 'నేనే రాజు నేనే మంత్రి'. 

ఈ చిత్రం క్లైమాక్స్‌ విషయంలో తేజ ఇలాగే ఉండాలని చెప్పడం.. రాజశేఖర్‌ క్లైమాక్స్‌ని మార్చాలని పట్టుబట్టడంతో ఈ విషయంలో రాజశేఖర్‌, తేజ ఇద్దరు వెనక్కి తగ్గకుండా పట్టుబట్టడంతో 'అహం' వల్ల తేడాలు వచ్చి ఈ చిత్రాన్ని తేజ.. రానాతో చేశాడు. ఈ చిత్రాన్ని తేజ.. రానాతో చేసేటప్పుడు కూడా ఆయన సురేష్‌బాబుకి, రానాకి తాను చెప్పినట్లు ఒప్పుకుంటేనే చేస్తానని చెప్పానని తేజ ఈ మద్య చెప్పాడు. ఇక ఈ విషయంలో రాజశేఖర్‌ క్లైమాక్స్‌ విషయంలో తనకు, తేజాకు విభేదాలు వచ్చాయని క్లారిటీ ఇచ్చేశాడు. తనకు తేజ 'వందేమాతరం' నుంచి తెలుసునని, ఆ చిత్రానికి ఆయన అసిస్టెంట్‌గా కెమెరా విభాగంలో చేశాడని, తేజ చిన్ననాడు జీవితకి క్లాస్‌మేట్‌ అని చెప్పుకొచ్చాడు. ఆయన్ను డైరెక్టర్‌గా మారమంది తానేనని, ఆ చనువుతో తాను క్లైమాక్స్‌ మార్చమంటే వెళ్లిపోయి రానాతో సినిమా చేశాడన్నారు. 

Rajasekhar Clarity on Nene Raju Nene Mantri Chance:

Rajasekhar Talks About Rana Nene Raju Nene Mantri at PSV Garuda Vega Interview

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement