Advertisement

అమ్మో... 36 కోట్ల లాభం వచ్చిందా..?

Sun 17th Sep 2017 04:21 PM
jr ntr,kalyan ram,jai lava kusa,jai lava kusa pre release business  అమ్మో... 36 కోట్ల లాభం వచ్చిందా..?
Jai Lava Kusa Huge Profits For Kalyan Ram అమ్మో... 36 కోట్ల లాభం వచ్చిందా..?
Advertisement

ఈ దసరా సెలవల్ని క్యాష్ చేసుకోవడానికి ఎన్టీఆర్ 'జై లవ కుశ' రెడీ అయిపొయింది. ఎన్టీఆర్ అన్నగారు కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి భారీ బడ్జెట్ పెట్టాడు కళ్యాణ్ రామ్. అయితే ఎన్టీఆర్ అన్న నిర్మాత కాబట్టి జై లవ కుశ చిత్రాన్ని చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మించేసి జై లవ కుశ ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా కళ్యాణ్ రామ్ కోట్లు వెనకేసుకున్నాడనే టాక్ సోషల్ మీడియాలో తెగ ట్రేండింగ్ లో ఉంది. కానీ బయటి హీరోలకే భారీ బడ్జెట్ పెట్టి తీసి చేతులు కాల్చుకున్న కళ్యాణ్ రామ్ తమ్ముడు తారక్ కోసం మాత్రం ఎందుకు తగ్గుతాడు. అందుకే ఖర్చుకు వెనుకాడకుండా కళ్యాణ్ జై లవ కుశకు బడ్జెట్ ఎక్కించాడట.

అయితే పెట్టిన బడ్జెట్ కన్నా జై లవ కుశ బిజినెస్ ద్వారా వచ్చిన లాభాలు ఎక్కువేనట. జై లవ కుశ కు పెట్టిన బడ్జెట్ కు జై లవ కుశ పబ్లిసిటీ ఖర్చు, ఎన్టీఆర్ పారితోషం ఇలా అన్నిటికి పోను కళ్యాణ్ రామ్ కి 36  కోట్ల మేర లాభం వచ్చినట్లుగా తెలుస్తుంది. మరి భారీ బడ్జెట్ పెట్టినప్పటికీ భారీగానే లాభాలు రాబట్టుకున్నాడు కళ్యాణ్ రామ్. ఇక కళ్యాణ్ రామ్ ఎంత రిచ్ అయినప్పటికీ.... చాల సినిమాలకు నిర్మాతగా చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇక ఇప్పుడు మాత్రం జై లవ కుశకు వచ్చే లాభాలతో కళ్యాణ్ రామ్ పోగొట్టుకున్న మనీ అంతా రికవరీ అయినట్లే అని చెబుతున్నారు.

ఇక జై లవ కుశ కు భారీగా బడ్జెట్ పెట్టడమే కాదు సినిమాని ఎంతగా పబ్లిసిటీ చెయ్యాలో అంతగా పబ్లిసిటీ కూడా చేస్తున్నారు. జై లవ కుశ పబ్లిసిటీ కే కోట్లు ఖర్చు పెడుతున్నట్లుగా తెలుస్తుంది. కేవలం జై లవ కుశ ఎఫ్ఎమ్ రేడియో పబ్లిసిటీకే 20లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రింట్, వెబ్ మీడియా అన్ని కలిపి చాలానే ఖర్చు పెడుతున్నారట. ఇక జై లవ కుశ గ్రాఫిక్ ఖర్చులు కూడా భారీగానే అయ్యాయట. మరి ఇన్ని ఖర్చులన్నీ తీసెయ్యగా మొత్తం మీద 36  కోట్ల భారీ లాభాన్ని కళ్యాణ్ రామ్ వెనకేసుకున్నాడనేది మాత్రం నిజమే అంటున్నారు.

Jai Lava Kusa Huge Profits For Kalyan Ram:

Jai Lava Kusa made mind blowing pre release business and in fact highest ever for a Tarak film. Kalyan Ram from financial doldrums is almost achieved.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement