'స్పైడర్‌' విలన్ కి ఎందుకింత భయం?

Mon 14th Aug 2017 12:21 PM
bharath,spyder villain,premisthe movie fame,spyder movie  'స్పైడర్‌' విలన్ కి ఎందుకింత భయం?
Spyder Villain Bharat Fear with Spyder Villain Role 'స్పైడర్‌' విలన్ కి ఎందుకింత భయం?
Sponsored links

మహేష్‌బాబు హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోన్న ద్విభాషా చిత్రం 'స్పైడర్‌'. సెప్టెంబర్‌ 27న దసరా కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో ఎస్‌.జె.సూర్య మెయిన్‌ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన టీజర్‌లో సూర్య విలనీ రేంజ్‌ ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో మరో యంగ్‌ హీరో, 'ప్రేమిస్తే' ఫేమ్‌ భరత్‌ కూడా యంగ్‌ విలన్‌గా నటించనున్నాడు. 

తెలుగులో మొదటి సారిగా స్ట్రెయిట్‌ చిత్రం అవకాశం రావడం, మహేష్‌బాబు, మురుగదాస్‌ల వల్లనే ఈ చిత్రంలో విలన్‌గా నటించడానికి ఒప్పుకున్నానని, ఇకపై ఎంత పెద్ద చిత్రంలో విలన్‌ పాత్ర వచ్చినా చేయనని, హీరోగా పేరు తెచ్చుకోవడమే తన లక్ష్యమని చెప్పాడు. తాజాగా భరత్‌ మరోసారి అదే మాటను చెబుతున్నాడు. మొత్తానికి ఈ చిత్రంలో యంగ్‌ విలన్‌గా నటిస్తున్న తనకు ఇక నుంచి అలాంటి పాత్రలే వస్తాయనే భయంతోనే ఆయన ఈ విధంగా పదే పదే అదే మాటను చెబుతున్నాడని, ఆయన ప్రస్తుతం అభద్రతాభావంలో ఉన్నాడని అంటున్నారు. 

ఇక ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుండటం వల్ల ప్రతి సీన్‌ని రెండు సార్లు చేయాల్సి వచ్చేదని, తెలుగు రాకపోవడం వల్ల తాను ఎక్కువ టేక్స్‌ తీసుకుని, ఆలస్యం చేసినా మహేష్‌ బాబు ఎంతో సహనంతోనే ప్రవర్తించాడని మహేష్‌ని ఈ యంగ్‌ హీరో అండ్‌ విలన్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. మొత్తానికి ఈ 'స్పైడర్‌' చిత్రం ఈయనకు ఎలాంటి అనుభవాన్ని ఇస్తుందో వేచిచూడాల్సివుంది....! 

Sponsored links

Spyder Villain Bharat Fear with Spyder Villain Role:

Youngh Hero Bharath About Spyder movie Villain Role 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017