యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్ క్లాసు, స్లిమ్ము.. !

Sun 13th Aug 2017 11:37 PM
young tiger ntr,slim look,class look,trivikram srinivas  యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్ క్లాసు, స్లిమ్ము.. !
Young Tiger Ntr look for Trivikram Film యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్ క్లాసు, స్లిమ్ము.. !

ఒకప్పుడు మన హీరోలు కొత్తలుక్‌లు, ఫిజిక్‌లపై దృష్టి పెట్టేవారు కాదు. కానీ బాలీవుడ్‌, కోలీవుడ్‌ హీరోల నుంచి మన స్టార్స్‌ కూడా దీనిని నేర్చుకుంటున్నారు. దీనికి తొలుత తెర తీసి మొదటి సిక్స్‌ప్యాక్‌ బాడీని సాధించినది అల్లు అర్జునే. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన 'దేశముదురు'తో బన్నీ ఈ ఫీట్‌ సాధించాడు. దాంతో మన యంగ్‌ హీరోలు, స్టార్స్‌, చివరకు సునీల్‌ వంటి కామెడీ హీరో, నాగార్జున వంటి సీనియర్‌ స్టార్స్‌ కూడా దీనిపై దృష్టిపెట్టారు. ఇక నాగార్జునతో పుట్టుకతోనే ఆరుపలకల బాడీ కావడంతో ఆయన ఎంతో కష్టపడకుండానే 'ఢమరుకం' చిత్రం కోసం ఇది చేశాడు. ఇక చిరంజీవి తన 150వ చిత్రం కోసం, వెంకీ 'గురు' కోసం షేప్‌లు మార్చారు. సునీల్‌ 'పూలరంగడు'లో సిక్స్‌ప్యాక్‌ సాధించాడు. ప్రభాస్‌, రానానుంచి అందరు ఇదే ఫాలో అవుతున్నారు. 

ఇక ఎన్టీఆర్‌ పూరీజగన్నాథ్‌ 'టెంపర్‌' కోసం సిక్స్‌ ప్యాక్‌ సాధించి, చొక్కా విప్పి మరీ తన బాడీని చూపించాడు. ఇక ప్రస్తుతం 'జై లవ కుశ'కోసం ఆయన కాస్త బొద్దుగా తయారయ్యాడు. ఇందులోని 'జై' పాత్రలో ఆయన కాస్త బరువు పెరిగి కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటించనున్నాడని సమాచారం. ఈ చిత్రం కోసం కాస్త బరువు తగ్గాల్సివుండటంతో 'జై లవ కుశ' షూటింగ్‌ చివరి దశలో ఉండటంతో ఎన్టీఆర్‌ ఓ స్పెషల్‌ ట్రైనర్‌ సహాయంతో బరువు తగ్గేందుకు బాగా కష్టపడుతున్నాడట. 

ఇక 'జై లవ కుశ' చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్‌ మూడో వారంలో విడుదల కానుండగా, ఎన్టీఆర్‌ మరోవైపు 'బిగ్‌బాస్‌' షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఆయన త్రివిక్రమ్‌ చిత్రంలో బరువు తగ్గి స్లిమ్‌గా, క్లాస్‌ లుక్‌లో ఎలా ఉంటాడో చూద్దాం. 

Young Tiger Ntr look for Trivikram Film:

Young tiger Jr NTR Slim and Class Look for Trivikram Srinivas

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017