డ్రగ్స్‌ : ఇప్పుడిక రవితేజ వంతు..!

Sun 13th Aug 2017 10:35 PM
raja the great,raviteja,raja the great teaser launch date  డ్రగ్స్‌ : ఇప్పుడిక రవితేజ వంతు..!
Raviteja Raja The Great Independence Day Special డ్రగ్స్‌ : ఇప్పుడిక రవితేజ వంతు..!
Sponsored links

పూరీ జగన్నాథ్‌ తన 'పైసా వసూల్‌' చిత్రం స్టంపర్‌, స్టంపర్‌ మేకింగ్‌ వీడియా, ఈనెల 17న ఆడియో వేడుక, సెప్టెంబర్‌1న సినిమా విడుదల నేపధ్యంలో ఆయనపై ఉన్న డ్రగ్స్‌ కేసు దృష్టి నుంచి ప్రజలను, ప్రేక్షకులను దారి మళ్లించడంలో సక్సెస్‌ అయ్యాడు. ఇక ముమైత్‌ఖాన్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో సందడి చేస్తూ తాను కూడా అందరి దృష్టిని మరల్చింది. ఇక నవదీప్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వైల్డ్‌కార్డు ఎంట్రీ ద్వారా అదే పని చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మాస్‌ మహారాజా రవితేజ వంతు వచ్చింది. 

ప్రస్తుతం రవితేజ రెండు చిత్రాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి విక్రమ్‌ సిరికొండ అనే నూతన దర్శకునితో 'టచ్‌ చేసి చూడు'కాగా, రెండోది దిల్‌రాజు నిర్మాతగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్‌'. కాగా మొదటగా 'టచ్‌ చేసి చూడు' విడుదలవుతుందని, ఇక అక్టోబర్‌ 12న దిల్‌రాజు 'రాజా ది గ్రేట్‌' విడుదల అవుతుందని పలువురు భావించారు. కానీ పరిస్థితి చూస్తే మొదటగా దిల్‌రాజు- అనిల్‌ రావిపూడిల 'రాజా ది గ్రేట్‌' చిత్రమే ముందుగా విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో రవితేజ అంధునిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌లో కూడా చేతిలో స్టిక్‌తో రవితేజ అలానే కనిపించాడు. 

'ఆటోగ్రాఫ్‌' చిత్రం తర్వాత రవితేజ చేస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం కావడంతో అందరి చూపు ఈ చిత్రంపై ఉంది. కాగా ఈ చిత్రం టీజర్‌ని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు. ఇక 'రాజా ది గ్రేట్‌' ద్వారా దిల్‌రాజు మరోసారి బాక్సాఫీస్‌ని కొల్లగొట్టడం ఖాయమంటున్నారు. 

Sponsored links

Raviteja Raja The Great Independence Day Special:

Raja The Great Teaser Release on August 15

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017