'లై' కాదు.. ఈ మిత్రులు 'లెజెండ్స్'!

Sun 13th Aug 2017 04:17 PM
jagapathi babu,arjun,action king,friends,villain roles  'లై' కాదు.. ఈ మిత్రులు 'లెజెండ్స్'!
Jagapathi Babu and Arjun Success in Villain Roles 'లై' కాదు.. ఈ మిత్రులు 'లెజెండ్స్'!
Sponsored links

సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలు స్నేహితులవడం... ఆ స్నేహం సినిమాల్లోనే కాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ గా మారడం అనేది మనం చూస్తూనే ఉంటాం. అయితే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో జగపతిబాబు, హీరో అర్జున్ ల స్నేహం ఎన్నో ఏళ్లగా సాగుతుంది. వీరిద్దరూ కలిసి సినిమాల్లో నటించడమే కాదు మంచి ఫ్రెండ్స్ కూడా. షూటింగ్స్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు జగపతిబాబు ఇంట్లో ఉండేంత చనువు అర్జున్ కి ఉండడం.. జగపతిబాబు చెన్నై వెళ్ళినప్పుడు అర్జున్ ఇంటికి వెళ్లడం వంటి విషయాలు అందరికి తెలిసినవే. అంత మంచి స్నేహం వారిద్దరి మధ్యన వుంది. అయితే మిత్రులిద్దరూ హీరోలుగా కొనసాగుతూనే ఇప్పుడు విలన్స్ గా టర్న్ తీసుకున్నారు.

జగపతిబాబు హీరోగా నటిస్తూనే కొన్ని కారణాలవల్ల సినిమాకు దూరమై చాలా కాలం సినిమా ఇండస్ట్రీకి కూడా దూరమయ్యాడు. కానీ బోయపాటి కోరిక మేరకు జగపతిబాబు, బాలకృష్ణ హీరోగా వచ్చిన 'లెజెండ్' సినిమాలో విలన్ గా నటించి అదరగొట్టే పెరఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా ఇరగదీసేశాడు. ఇక 'లెజెండ్' లోని జగపతి నటనకు బోలెడంత పేరొచ్చింది. ఆ తర్వాత జగపతిబాబు ఎక్కువగా విలన్ రోల్స్ కి పరిమితమైన కొన్ని సపోర్టింగ్ రోల్స్ లోను ఆకట్టుకున్నాడు. 

ఇక హీరో అర్జున్ మొదటిసారి విలన్ గా నటించిన 'లై' చిత్రం కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. 'లై' చిత్రంలో నితిన్ కి విలన్ గా నటించిన అర్జున్ నటనకు అందరూ ఫుల్ మార్కులు వేసేస్తున్నారు. మైండ్ గేమ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్జున్ నటన అద్భుతమంటూ అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. స్టైలిష్ విలన్ గా అర్జున్ అదరగొట్టాడంటూ కితాబునిచ్చేస్తున్నారు. మరి హీరోగానే చేస్తున్న అర్జున్ ఈ చిత్రంతో విలన్ గా సక్సెస్ సాధించాడు కాబట్టి మరిన్ని సినిమాల్లో మనం అర్జున్ ని విలన్ గా చూడొచ్చో లేదో మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

ఈ లెక్కన ఇద్దరు మిత్రులు విలన్ గా ఎంటర్ అయిన మొదటి సినిమాతోనే హిట్టందుకుని సక్సెస్ అయ్యారు. 

Sponsored links

Jagapathi Babu and Arjun Success in Villain Roles:

Jagapathi Babu Villain Entry and Arjun Villan Entry Success at Box Office

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2017