పూరి.. కూతురు పవిత్ర లైన్లోకొచ్చింది..!

Mon 17th Jul 2017 12:44 PM
puri jagannadh,daughter pavithra,pavithra fires on media,drug scam  పూరి.. కూతురు పవిత్ర లైన్లోకొచ్చింది..!
Puri’s Daughter Pavithra Fires on Media పూరి.. కూతురు పవిత్ర లైన్లోకొచ్చింది..!

టాలీవుడ్ ఇప్పుడు డ్రగ్స్ మాఫియా లింక్స్ తో క్షణ క్షణం ఇప్పుడు ఉత్కంఠగా మారిపోయింది. టాలీవుడ్ లో కొందరి సెలబ్రిటీస్ కి సిట్ నోటీసులు పంపడంతో మొదలైన రచ్చ కొంతమంది అరెస్ట్ లతో ఆగుతుందేమో అంటున్నారు. ఇక ఇప్పటికే 12  మందికి నోటీసులు అందుకున్న వారిలో ప్రముఖంగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ అండ్ క్యాంప్ ఉంది. అయితే పూరి జగన్నాధ్ కేవలం డ్రగ్ ఎడిట్ మాత్రమే కాక డ్రగ్ మాఫియాతో సంబంధాలు మెయింటింగ్ చేస్తూ వ్యాపారంలో కూడా ఇన్వాల్వ్ అయ్యాడని రకరకాలుగా మీడియాలో ప్రచారం జరుగుతుంది. 

ఇక పూరి కూడా పరిశ్రమలోని పెద్దల పేర్లు బయటపెట్టాడంటూ అని ప్రచారం అవుతున్న వేళ హడావిడిగా పూరి ఒక ట్వీట్ వేశాడు. తాను ఎవరి పేర్లు చెప్పలేదని .... అసలు పైసా వసూల్ చిత్రం షూటింగ్ లో బిజీగా వున్నానని చెప్పాడు. అయితే ఇప్పుడు పూరిగారి కూతురు పవిత్ర లైన్లోకొచ్చి తన తండ్రికి డ్రగ్స్ విషయంలో ఏపాపం తెలియదని... మా నాన్న ఒక సెలెబ్రిటీ కాబట్టి... ఎవరిష్టమొచ్చినట్టు వారు ఊహించేసుకుని పుకార్లు పుట్టించడం సరికాదని.... ఆయనకంటూ ఒక కుటుంబం ఉందని, ఇలాంటి వన్నీ పుట్టిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటంటూ నిలదీస్తుంది. అసలీ అబద్దం ఎప్పుడు నిజం కాదు.

మా నాన్నకి డ్రగ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకంటూ ఒక టాలెంట్ వుంది. దానితో ఆయన కెరీర్ ని చక్కదిద్దుకోగలరు. ఇలా డ్రగ్స్ వ్యాపారం లాంటి ఇల్లీగల్ పనులు చెయ్యాల్సిన అవసరం లేదంటూ... ఏదన్న రాసేముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోమంటూ హెచ్చరిస్తుంది. మరి పూరి మాత్రం డ్రగ్స్ ఊసెత్తకుండా ఏదో ఒక ట్వీట్ పడేశాడు కానీ కూతురు పవిత్ర మాత్రం బాగా ఫైర్ అయ్యిందంటున్నారు. 

Puri’s Daughter Pavithra Fires on Media:

Puri Jagannadh’s daughter  Pavithra  also fired on media  for targeting her father in the drug scam.

Latest

Latest

Popular in Times

Contact us    Privacy     © 2017