మొత్తానికి మెగా హీరోలు జాగ్రత్త పడుతున్నారు..!

Sun 16th Jul 2017 07:19 PM
sai dharam tej,ram charan,allu arajun,varun tej  మొత్తానికి మెగా హీరోలు జాగ్రత్త పడుతున్నారు..!
Mega Heroes are Cautious మొత్తానికి మెగా హీరోలు జాగ్రత్త పడుతున్నారు..!

నిజానికి మెగా హీరోలందరూ చిరంజీవి వేసిన రహదారిని వాడుకున్న వారే, అందులో సందేహం లేదు. కానీ బన్నీ మాత్రం అనవరసంగా ఎమోషన్‌తో 'చెప్పను బ్రదర్‌' అని వివాదం తెచ్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి బన్నీ ఏమి మాట్లాడినా దానికి పెడార్థాలు ఎక్కువైపోయాయి. 'డిజె' కలెక్షన్లు ఇంత అని ప్రకటిస్తే మా మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 150వ చిత్రం 'ఖైదీనెంబర్‌ 150' కంటే ఎక్కువ చెబుతావా? అని బన్నీని, దిల్‌రాజును అందరినీ మెగాభిమానులు ఓ ఆటాడుకున్నారు. 

మరో వైపు ఈ చిత్రం గురించి నెగటివ్‌గా మాట్లాడిన, రివ్యూలు రాసిన అందరినీ బన్నీ, దిల్‌రాజు, హరీష్‌ శంకర్‌లు టార్గెట్‌ చేయడంతో మీడియా నుంచి సాధారణ మెగాభిమానుల వరకు భగ్గుమంటున్నారు. ఇక లాభం లేదని, తాజాగా బన్నీ సన్నిహితులు కొందరు 'అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ క్లబ్‌' అనే ట్విట్టర్‌ అకౌంట్‌ని ఓపెన్‌ చేసి బన్నీకి మద్దతు ఇస్తూనే చిరంజీవి అన్నా, పవన్‌ కళ్యాణ్‌ అన్నా బన్నీకి ఎంత ఇష్టమో చెప్పి సర్ధిచెప్పే ప్రయత్నం మొదలుపెట్టారు. బన్నీ ఆఫీసులో ఉన్న చిరంజీవి ఫోటోలను హైలేట్‌ చేస్తూ దానిలో ఓ ఫొటో పోస్ట్‌ చేశారు. 

మరో వైపు ఈ పరిణామంతో రామ్‌ చరణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌లు అలర్ట్‌ అయిపోయారు. వరుణ్‌ తేజ్‌ పవన్‌ గురించి అరుస్తున్న అభిమానులకు మేము ఈ స్థితిలో ఉండటానికి పెదనాన్న, బాబాయ్‌లే కారణమని మెప్పించాడు. ఇక సాయి ధరమ్‌ తేజ్‌ అయితే మరో అడుగు ముందుకేసి ఖచ్చితంగా మాట్లాడుకుందాం బ్రదర్‌.. ఇంత పెద్ద పెద్ద వేడుకల్లో వారి గురించి మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టం అని చెప్పేశాడు. 

తాజాగా రామ్‌చరణ్‌ 'దర్శకుడు' వేడుకలో మాట్లాడుతూ, మనకి మరీ ఇష్టమైన వారి గురించి మనసులో ఉంచుకోవాలి. కానీ ఎక్కువగా చెపుకోం. మన అమ్మ గురించి కూడా ఎక్కువగా చెప్పుకోం గదా...! నచ్చిన మనుషులు మనుసులో ఎక్కువగా ఉండాలి. మాటల్లో తక్కువ ఉండాలి.. అంటూ ఓ పంచ్‌ విసిరాడు. ఇక బన్నీ ఆమద్య నేను చిరంజీవిని గుర్తు చేస్తానే గానీ ఇమిటేట్‌ చేయను అన్నది కూడా పెద్ద చర్చనీయాంశం అయింది. అంటే బన్నీ మాత్రం అనుకరించను అంటే రామ్‌ చరణ్‌ అనుకరిస్తాడనే కదా...! అన్నారు. సో.. సమయంలో వచ్చినప్పుడు 'అల్లు'పై చరణ్ బాగానే సెటైర్‌వేశాడని అంటున్నారు. 

Mega Heroes are Cautious:

Speaking at the recently Ramcharan's 'Dharshakudu ' movie audio celebration, we have to keep in mind our favorite people. But tell me more.

Latest

Latest

Popular in Times

Contact us    Privacy     © 2017