మొత్తానికి నాని, ఎన్టీఆర్ పక్కకి చేరాడు..!

Sun 16th Jul 2017 06:20 PM
nani,jr ntr,overseas,dollars movies club,ninnu kori movie,second place to nani  మొత్తానికి నాని, ఎన్టీఆర్ పక్కకి చేరాడు..!
Nani Second Place in America High Millions Dollars Movies మొత్తానికి నాని, ఎన్టీఆర్ పక్కకి చేరాడు..!

టాలీవుడ్ లో నాని రేంజ్ ఇప్పుడు స్టార్ హీరోలతో సమానంగా వుంది. వరుసగా 7  హిట్లతో ఏ హీరో సాధించలేని రేర్ ఫిట్ సాధించి కేక పుట్టించాడు. నాని తాజా చిత్రం 'నిన్ను కోరి' హిట్ టాక్ తో అదరగొట్టే కలెక్షన్స్ రాబడుతూ క్లాస్ మూవీ గా పేరు తెచ్చుకుంది. నాని 'నిన్ను కోరి' చిత్రం మొదటి వారంలోనే 25 కోట్లకు పైగా గ్రాస్ సాధించి.....17 కోట్ల దాకా షేర్ వసూలు చేసింది. అయితే సెకండ్ వీక్ లో ఈ కలెక్షన్స్ డ్రాప్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఈ సినిమా కి ఇపుడు వచ్చేదంతా లాభమే కాబట్టి పెద్దగా ప్రాబ్లెమ్ ఉండదంటున్నారు. ఈ శుక్రవారం విడుదలైన 'శమంతకమణి' చిత్రం కూడా పాసిటివ్  టాక్ తోనే దూసుకుపోవడం 'నిన్ను కొరి' కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. 

అయితే 'నిన్ను కోరి' ఇప్పుడు ఇక్కడ మాత్రమే అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టడం లేదు అక్కడ  ఓవర్సీస్ లో కూడా  ఈ సినిమా అదరగొట్టింది అంటున్నారు. వన్ వీక్ లోనే మిలియన్ క్లబ్బును అందుకుని అదరహో అనిపించింది. ఫస్ట్ వీక్ లోనే 8 లక్షల డాలర్లు వసూలు చేసిన ‘నిన్ను కోరి’.. రెండో వీకెండ్ కంటే ముందే మిలియన్ డాలర్ మార్కును అందుకుంది. మరి ప్రస్తుతం అమెరికాలో అత్యధిక మిలియన్ డాలర్ మూవీస్ ఉన్న హీరోల్లో నాని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత రెండో స్థానానికి చేరుకొని ఔరా అనిపించాడు.ఇక ఎన్టీఆర్ 'బాద్ షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్' వంటి నాలుగు సినిమాలతో ముందంజలో ఉన్నాడు . 

నాని కూడా నాలుగు మిలియన్ డాలర్ మూవీస్ ను ఖాతాలో వేసుకుని ఆ తర్వాతి స్థానానికి వచ్చేశాడు. ఇంతకు ముందు 'ఈగ, భలే భలే మగాడివోయ్, నేను లోకల్' సినిమాలతో మిలియన్ క్లబ్బును అందుకున్న నాని  ఇప్పుడు ‘నిన్ను కోరి’తో నాలుగో సారి ఆ క్లబ్బును టచ్ చేశాడు. ఇకపోతే మూడు మిలియన్ డాలర్ సినిమాలతో 'అత్తారింటికి దారేది - గోపాల గోపాల - సర్దార్ గబ్బర్ సింగ్' తో పవన్ కళ్యాణ్  మూడో స్థానానికి పడిపోయాడు.

Nani Second Place in America High Millions Dollars Movies:

Nani among the most million dollar movies currently in America, Second place is nani and first place is Jr NTR.

Latest

Latest

Popular in Times

Contact us    Privacy     © 2017