Advertisement

రామ్ చరణ్ కే ఎందుకిలా జరుగుతోంది..?

Wed 12th Jul 2017 06:10 PM
ram charan,rangasthalam 1985,pawan kalyan,khaidi no 150,sacrifier  రామ్ చరణ్ కే ఎందుకిలా జరుగుతోంది..?
Ram Charan Turned Sacrifier? రామ్ చరణ్ కే ఎందుకిలా జరుగుతోంది..?
Advertisement

నేడున్న పరిస్థితుల్లో ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పెద్దస్టార్‌ చిత్రమైనా సరే ఓపెనింగ్స్‌పైనే ఆధారపడుతున్నాయి. రెండో వారం కల్లా, ఇంకా చెప్పాలంటే మొదటి వీకెండ్‌ అయిన వెంటనే పైరసీలురావడం, యాంటీఫ్యాన్స్‌ చేస్తున్న నెగటివ్‌ కామెంట్స్‌తో రివ్యూలు, మౌత్‌టాక్‌తో మొదటి వీకెండ్‌ కలెక్షన్లతోనే దర్శకనిర్మాతలు, హీరోలు సరిపెట్టుకుంటూ టిక్కెట్ల రేట్లతో పాటు షోలు ఎక్కువ వేసి, అన్ని థియేటర్లలో తమ సినిమానేఉండేలా చూసుకుంటూ, ప్రీమియర్‌షోల వంటివాటిపై ఆధారపడుతున్నారు. సినిమాలలో మంచి కంటెంట్‌ ఉందనే నమ్మకంతో ఇతర సినిమాలతో పోటీపడితే రిజల్ట్‌ కూడా తేడాగానే వస్తోంది. 

'బాహుబలి' నుంచి 'శ్రీమంతుడు' వరకు తిరుగులేని కంటెంట్‌ ఉన్నచిత్రాలు కూడా దీనిని నిరూపించాయి. దాంతో సోలో రిలీజ్‌లకై తపన మొదలైంది. ఇక దసరా, దీపావళి, వేసవి, సంక్రాంతి పండగలకు.. నాలుగైదు చిత్రాలు ఒకేసారి వచ్చినా సినిమాలో దమ్ముంటే వాటిని భరించగల సత్తా ఆ పండగలకు ఉంటుందని, ప్రేక్షకులు కూడా బాగానే చూస్తారనే విశ్లేషణలైతే వస్తున్నాయి.

కానీ సంక్రాంతి కదా..! అని ఒకేసారి నాలుగైదు చిత్రాలు వరుసగా విడుదలైతే అన్ని చిత్రాలు హిట్టయినా సరే.. కేవలం ఒకే ఒక్క చిత్రాన్ని, అందులోని నాలుగింటిలో ది బెస్ట్‌ అనిపించుకున్న సినిమానే వేలల్లో ఖర్చుపెట్టి సామాన్య ప్రేక్షకులు, ఫ్యామిలీలు చూస్తున్నారు. ఇలా చూడటం వల్ల ఇంకా ఎక్కువ కలెక్షన్లు సాధించాల్సిన చిత్రాలు ఆస్థాయిలో కలెక్షన్ల  రాబట్టలేక..థియేటర్ల సమస్య వల్ల.. ఆయా చిత్రాలు రెండు మూడు వారాలు కలెక్షన్ల పంచుకుని కనిపించకుండా పోతున్నాయి. 

అయితే అల్లుఅర్జున్‌ మాత్రం తన సినిమాలో కంటెంట్‌ ఉందా? లేదా? అనేది ఆలోచించడు. అందరూ పోటీ పడే పండగలను, సెలవులనైనా మిస్‌ చేసుకుంటాడు గానీ తన చిత్రం విడుదలైన తర్వాత కనీసం రెండు వారాల గ్యాప్‌లో మరో చిత్రం పోటీ పడకుండా తన తండ్రితో పాటు చర్చించి, ఎంతో ఆలోచించి, కావాలంటే సినిమాను కొన్ని రోజులైనా వాయిదా వేస్తాడే గానీ పోటీకి దిగడు. దాంతోనే యావరేజ్‌ టాకే కాదు..నెగటిట్‌ టాక్‌ తెచ్చుకున్న 'రేసుగుర్రం, సన్నాఫ్‌సత్యమూర్తి, సరైనోడు'తో పాటు తాజాగా 'డిజె' కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో 'నిన్ను కోరి' వంటి పోటీ రానంతవరకు బాగానే కుమ్మేసి 100కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టాడు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ పరిస్థితి మరో రకంగా వుంది. 

వాస్తవానికి త్రివిక్రమ్‌-పవన్‌ల చిత్రం దసరాకిగానీ లేదా దీపావళికి గానీ రిలీజ్‌ చేయాలని భావించారు. కానీ ఇప్పుడు సంక్రాంతికి వెళ్లిపోయింది. ఇక సంక్రాంతి బరిలోనే రామ్‌చరణ్‌-సుకుమార్‌ల చిత్రం కూడా రిలీజ్‌ అవుతుందని భావించారు. కానీ సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉండటం, అందులోనూ బాబాయ్‌ చిత్రం ఉండటం, మరోవైపు జనవరి 25న '2.0' రిలీజ్‌ కానుండటంతో 'రంగస్థలం-1985'ని క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ ద్వితీయార్థం లోనే సోలో మూవీగా రిలీజ్‌ చేసేందుకు సరైన డేట్‌ కోసం వెతుకుతున్నారు.

చరణ్ ధృవ సినిమా టైం లో కూడా ఇలాగే జరిగింది. సంక్రాంతి కి రావాల్సిన ధృవ, చిరంజీవి ఖైదీ...చిత్రం కోసం త్యాగం చేసి డిసెంబర్ లోనే వచ్చేసింది. మోడీ ఎఫెక్ట్, సరైన టైం లో విడుదల కాకపోవడం వంటివి..ధృవ సినిమా బాగున్నా కూడా కలెక్షన్ల విషయంలో దెబ్బేశాయి. మళ్లీ ఇప్పుడు బాబాయ్ సినిమా ఉందని..చరణ్ త్యాగం చేయడం..చరణ్ కెరీర్ కి ఎంత వరకు హెల్ప్‌ అవుతుందో చూడాల్సివుంది.....! 

Ram Charan Turned Sacrifier?:

Pawan Kalyan film's release date has been locked to January 12 while Rangasthalam's release date has been advanced to December.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement