Advertisement

పైన పటారం...లోన లోటారం అంటే ఇదే!

Fri 23rd Jun 2017 03:48 PM
satellite rights,spyder,pawan kalyan,jai lava kusa,paisa vasool,business details  పైన పటారం...లోన లోటారం అంటే ఇదే!
Tollywood New Movies Business Details పైన పటారం...లోన లోటారం అంటే ఇదే!
Advertisement

ప్రస్తుతం తెలుగు సినిమా మార్కెట్‌ బాగాపెరిగింది. ముఖ్యంగా 'బాహుబలి' తర్వాత లెక్కలు తారుమారయ్యాయి. దాంతో పెద్ద హీరోలంతా తమ శాటిలైట్‌ రైట్స్‌ను, ఓవర్‌సీస్‌ రేట్లను విపరీతంగా పెంచేశారట. మహేష్‌ స్పైడర్‌ చిత్రానికి తెలుగులో మహేష్‌బాబు, తమిళంలో మురుగదాస్‌లు హీరోలు. ఈ చిత్రం ఓవర్‌సీస్‌ రైట్స్‌ను నిర్మాతలకు ఏకంగా 25కోట్లు అడగడంతో కొనేవారు మౌనంగా ఉంటున్నారు. ఇప్పుడు నిర్మాతలే 16కోట్లకు దిగారట. మహేష్‌కు ఓవర్‌సీస్‌లో ఉన్న క్రేజ్‌ని, మురుగదాస్‌ గుడ్‌విల్‌ను క్యాష్‌ చేసుకోవాలని భావించిన నిర్మాతలకు చుక్కెదురవుతోంది. ఎన్టీఆర్‌ 'జై లవ కుశ'కు 16కోట్లు చెబితే 14కి కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదని సమాచారం. 

ఇక పవన్‌-త్రివిక్రమ్‌ల హ్యాట్రిక్‌ మూవీ పరిస్థితి కూడా అలాగే ఉంది. దీనికి 20కోట్లు చెబుతున్నారు. కానీ రెవిన్యూ షేరింగ్‌లో కొత్త నియమ నిబంధనలను పెట్టేసరికి దానికి కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదట. ఇక పవన్‌కు 'అత్తారింటికిదారేది' తర్వాత అద్భుతమైన మార్కెట్‌ వచ్చింది. దాంతో ఈరోస్‌ వంటి సంస్థ రిలయెన్స్‌కి పోటీ పడి 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఉత్తరాది రైట్స్‌, థియేటికల్‌, శాటిలైట్‌ రైట్స్‌ను 20కోట్లకు కొని దారుణంగా దెబ్బతిన్నారు. ఇక ఇటీవల 'కాటమరాయుడు' పరిస్థితి కూడా బాగా లేకపోవడంతో పవన్‌, త్రివిక్రమ్‌ల మూవీ ఉత్తరాదిలో థియేటికల్‌ ఆడియో, శాటిలైట్‌, యూట్యూబ్‌ రైట్స్‌ను కేవలం 11కోట్లు మాత్రమే పలికింది. 

ఇక బాలయ్య-పూరీల 'పైసా వసూల్‌' పరిస్తితి మరింత దారుణం. బాలయ్య మాస్‌కి ఓవర్‌సీస్‌లో మార్కెట్‌ లేదు. పైగా పూరీ ప్లాప్‌లలో ఉండటంతో 'గౌతమీపుత్ర శాతకర్ణి' కంటే కూడా చాలా తక్కువ రేటుకు అడుగుతున్నారట. ఇది ఫిలింనగర్‌ నయా కహాని. 

Tollywood New Movies Business Details:

After Baahubali Tollywood Movie Producers Hikes Satellite Price and Others. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement