Advertisement

దువ్వాడకి జాగ్రత్తలు ఎక్కువైనాయ్!

Wed 21st Jun 2017 10:03 PM
dj duvvada jagannadham,allu arjun,harish shankar,benifit shows,allu aravind,dil raju  దువ్వాడకి జాగ్రత్తలు ఎక్కువైనాయ్!
Bunny and Aravind special Caring on DJ దువ్వాడకి జాగ్రత్తలు ఎక్కువైనాయ్!
Advertisement

తెలుగులో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవిలు ఉన్నప్పటి నుంచి బెనిఫిట్‌షోలు ఉండేవి. వాటిని అప్పుడు ఫ్యాన్స్‌షోలు అనే వారు. వీలుంటే రాత్రి 12గంటల నుంచే ఇవి మొదలయ్యేవి. వీటి రేట్లు అధికం. ముందుగా ఫ్యాన్స్‌ వారు కొన్ని షోలని బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచే బుక్‌ చేసుకుని ఎక్కువ టిక్కెట్‌ వల్ల వచ్చే ఆదాయంతో కటౌట్లు, పూలమాలలు, డెకరేషన్స్‌ చేసేవారు. ఆ తర్వాత దాని పేరు బెనిఫిట్‌ షోగా మార్చారు. ఫాన్స్‌ షో అయినా బెనిఫిట్‌ షో అయినా పేరు మార్పే కానీ అదనపు ఆదాయమే లక్ష్యం. ఇలా బెనిఫిట్‌షోల పేరుతో దందా మొదలైంది. 

ఇప్పుడు వాటికి కొత్త పేరు ప్రీమియర్‌షోలు. ఇవి కూడా అలాంటివే. కాకపోతే ఎవ్వరూ ఏమి చేయలేం. ప్రభుత్వాలే పట్టించుకోనప్పుడు సామాన్యుడు ఎన్ని తిట్లు తిట్టుకున్నా కూడా పోలీసులు, కలెక్టర్లే కాదు ఎవ్వరూ స్పందించడం లేదు. అయితే ముందురోజు నుంచి ఇలాంటి షోలు వేయడం వల్ల నష్టాలు బోలెడు ఉన్నాయి. పేరుతో అవి ప్యాన్స్‌కి మాత్రమే వేసే షోలైనప్పటికీ యాంటీ ఫ్యాన్స్‌ కూడా థియేటర్లలో ఎంత రేటైనా కొనేసి, బయటకు వచ్చి నెగటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ చేస్తున్నారు. దాంతో సినిమాలకు లాంగ్‌రన్‌లో దెబ్బపడుతోంది. 

అదే మొదటిరోజు ఉదయం 6గంటల నుంచి వేసినా రెండు మూడురోజుల్లో న్యూట్రల్‌ అభిమానులు కూడా చూస్తారు కాబట్టి ఒరిజినల్‌ టాక్‌ వచ్చి, బాగుంటే లాంగ్‌రన్‌కి ఉపయోగపడుతుంది. అందుకే బన్నీ తన తండ్రి అల్లుఅరవింద్‌తో కలిసి 'సరైనోడు' విషయంలో ముందు షోలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. దాంతో మొదటి వారం యావరేజ్‌కి టాక్‌ తెచ్చుకున్నప్పటికీ ఈ చిత్రం లాంగ్‌రన్‌లో బ్లాక్‌బస్టర్‌ అయింది.

సో.. అదే ఫార్ములాను బన్నీ, దిల్‌రాజులు 'డిజె' విషయంలో పాటిస్తున్నారు. ఓవర్‌సీస్‌లో తప్పితే రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం ఉదయం 6గంటలకు మాత్రమే షోలు మొదలు పెడతారట. సరే.. ఎవరి నిర్ణయం వారిది. అయినా సినిమాలో దమ్ము లేకపోతే ఏదీ ఈ చిత్రాలను కాపాడలేదు.. లాంగ్‌ రన్‌లో నిలవదు. కేవలం ఫ్యాన్స్‌ చూస్తేనే హిట్‌ కాదు అనేది మాత్రం వాస్తవం. 

Bunny and Aravind special Caring on DJ:

No special Shows to Allu Arjun DJ Duvvada Jagannadham. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement