Advertisement

బుల్లితెర పై చిరు కి మరో అవమానం..!

Sat 10th Jun 2017 01:30 AM
khaidi no 150,chiranjeevi,maa tv,trp ratings,film awards  బుల్లితెర పై చిరు కి మరో అవమానం..!
Khaidi No 150 gets Horrible TRP in Small Screen బుల్లితెర పై చిరు కి మరో అవమానం..!
Advertisement

చిరు కమ్ బ్యాక్ మూవీ  'ఖైదీ నెంబర్ 150' ఈ ఏడాది జనవరిలో విడుదలై నాన్ బాహుబలి రికార్డులను  బద్దలుకొట్టి మరీ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది... ఏకంగా 100  కోట్ల పైన కలెక్షన్స్ సాధించిందని బాగానే ప్రచారం జరిగింది. ఇక చిరు కూడా తొమ్మిదేళ్ల తర్వాత నటించిన చిత్రం కాబట్టి ఈ చిత్రం అన్ని రికార్డులను తిరగరాస్తుందని అన్నారు. అందుకే మా ఛానల్  ఖైదీ.... చిత్రానికి భారీగానే శాటిలైట్ హక్కులకు దారబోసింది. కానీ 'ఖైదీ నెంబర్ 150' వెండితెర మీద హిట్టయినట్టు బుల్లితెర మీద హిట్ కాలేక చతికిలపడింది. బుల్లితెర మీద ఖైదీ... చిత్రం ఘోరమైన ప్లాపును మూటగట్టుకుంది. 

పాపం ఖైదీ.. విడుదలైన నాలుగు నెలల తర్వాత ఈ చిత్రాన్ని మా ఛానల్ వారు ఎంతో పబ్లిసిటీతో గ్రాండ్ గా ప్రచారం చేశారు. కానీ ఖైదీ... చిత్రానికి అతి తక్కువ టీఆర్ఫీలు వచ్చి అందరిని విస్మయానికి గురి చేసింది. మరి వెండితెరమీద అంతగాదు... ఇంత అని ప్రచారం జరిగిన 'ఖైదీ నెంబర్ 150' ఇలా బుల్లితెర మీద కేవలం 6.93 టీఆర్పీ తెచ్చుకుంది. మరి మెగాస్టార్ మూవీ కి ఇంత ఘోరంగా టీఆర్ఫీ వస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే మా ఛానల్ వారు ఎన్నో రోజులు వెయిట్ చేసి వెయిట్ చేసి మరీ ఖైదీ కి బుల్లితెర మీద ముహూర్తం పెడితే అదే రోజు మరో ఛానల్ 'ఐఫా' అవార్డుల కార్యక్రమాన్ని ప్రచారం చేసింది. అసలు ఆరోజే ఖైదీ... టిఆర్పి రేటింగ్ పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు కొంతమంది. కానీ ఖైదీ... ఛానల్ లో ప్రచారం అయిన మరుసటి రోజు చిరు 'ఖైదీ నెంబర్ 150' బుల్లితెర రికార్డులను బద్దలు కొట్టేసిందని ఏవేవో వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి.

కానీ ఇప్పుడేమో చిరు సినిమాకి అతి తక్కువ టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయని అంటున్నారు. మరి చిరు ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడుతో తక్కువ టీఆర్పీలు తెచ్చుకోవడమే కాక చాలా విమర్శలు కూడా ఎదుర్కున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఖైదీ... తో కూడా పాపం బుల్లితెర మీద అభాసుపాలయ్యాడు. 

Khaidi No 150 gets Horrible TRP in Small Screen:

According to latest Television Rating Points (TRP) reports, Khaidi No 150 secured a poor 6.9 TRP when telecasted for the first time on Star MAA.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement