Advertisement

రజినీనే స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడిండట..!

Wed 24th May 2017 01:51 PM
rajinikanth,taminadu,tamilnadu politics,chiranjeevi,amitabh bachchan,kamal haasan,narendra modi  రజినీనే స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడిండట..!
Rajinikanth is Discussing His Political Entry With Chiranjeevi and Amitabh! రజినీనే స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడిండట..!
Advertisement

సమైఖ్య ఆంధ్రప్రదేశ్‌లో మెగా స్టార్‌ చిరంజీవి 'ప్రజారాజ్యం' పార్టీని స్థాపించి, దానిని నిలుపుకోలేక అపఖ్యాతి పాలయ్యాడు. మరోవైపు అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఎంపీగా పనిచేసి, ఆ తర్వాత మరలా రాజకీయల వైపు చూడలేదు కాగా ప్రస్తుతం రాజకీయ అరంగేట్రం గురించి ఆలోచిస్తున్న తలైవా రజినీకాంత్‌ తన రాజకీయ ఎంట్రీ విషయంలో చిరంజీవి, అమితాబ్‌లతో కలిసి చర్చిస్తున్నాడట.

వారు రాజకీయంగా ఎందుకు విఫలమైంది? అందులోని  కారణాలు ఏమిటి? ప్రాంతీయ పార్టీ మేలా? లేక జాతీయ పార్టీలో చేరడం మేలా? చిరు 'ప్రజారాజ్యం' వదిలేసి దానిని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? వంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

వీరికి తాజా రజినీనే స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడాడని అంటున్నారు. మరోపక్క తాను సొంతగా ప్రాంతీయ పార్టీని పెడితే తన సహచర నటుడు, స్టార్‌ కమల్‌ హాసన్‌ మద్దతుని కూడా తీసుకోవాలని కోరుకుంటున్నట్లు కోలీవుడ్‌ మీడియా అంటోంది. వీరి మధ్య కొన్ని విబేధాలున్నా కూడా నేటి పరిస్థితుల్లో కమల్‌తో కలిసి వెళ్లాలని రజినీ నిర్ణయం తీసుకున్నాడని చెబుతున్నాడు. కాగా మరి కొద్ది రోజుల్లో రజినీ ప్రధాని మోదీతో భేటీ కానున్నాడు. ఆలోపే తాను తుది నిర్ణయం తీసుకోవాలని తలైవా భావిస్తున్నాడు. 

Rajinikanth is Discussing His Political Entry With Chiranjeevi and Amitabh!:

In Andhra Pradesh, Mega Star Chiranjeevi founded the 'Praja Rajyam' party and was unable to retain it. While Amitabh Bachchan has worked as an MP and has never seen politics again, Talaiva Rajinikanth is currently discussing his political entry with Chiranjeevi and Amitabh.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement