Advertisement

సెలబ్రిటీలు ట్విట్టర్ పిట్టని అరిపించేస్తున్నారు!

Fri 28th Apr 2017 09:50 PM
baahubali 2,baahubali the conclusion,prabhas,ss rajamouli,celebrities tweets,jr ntr,nani,varun tej,saidharam tej,rakul preet singh  సెలబ్రిటీలు ట్విట్టర్ పిట్టని అరిపించేస్తున్నారు!
Baahubali 2 - Celebrities Response సెలబ్రిటీలు ట్విట్టర్ పిట్టని అరిపించేస్తున్నారు!
Advertisement

దేశం మొత్తంలోనే కాకుండా ప్రపంచంలో 'బాహుబలి ద కంక్లూజన్' 8000 థియేటర్స్ లో విడుదలై బాక్సాఫీస్ ని దున్నేస్తుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే సస్పెన్స్ కి ఇప్పుడు తెరపడింది. బాహుబలి చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా సఫలం అయ్యింది. అందుకే బాహుబలి తీసిన తర్వాత కలిగిన తృప్తి మరే చిత్రం తీసిన తర్వాత కలగలేదని జక్కన్న చెప్పిన మాట గుర్తుకు వస్తుంది బాహుబలిని చూస్తుంటే.  ఈ చిత్రం కోసం సామాన్య ప్రేక్షకులే కాదు సెలబ్రిటీస్ కూడా ఎంతో ఎదురు చూశారు. 

ఇక బాహుబలి చిత్రాన్ని చూసిన తర్వాత ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతుంటే సెలబ్రిటీస్ మాత్రం రాజమౌళి అండ్ టీమ్ ని పొగిడేస్తున్నారు. బాహుబలి ద బిగినింగ్ తో తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన జక్కన్న.. రెండో భాగంతో మరింతగా గౌరవాన్ని తీసుకొచ్చాడని కొనియాడుతున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.  ఆ సెలబ్రిటీస్ లో ముఖ్యంగా తారక్(ఎన్టీఆర్) అయితే దర్శకుడి దగ్గర మొదలు పెట్టి ప్రతి టెక్నీషియన్ ని... బాహుబలిలో నటించిన వారందరిని ట్విట్టర్ వేదికగా తెగ పొగిడేసాడు. 

ఎన్టీఆర్: దర్శక ధీరుడు జక్కన విజన్ ని సాకారం చేసేందుకు ఎంతో కృషిచేసిన ప్రభాస్, అనుష్క, రాణా, రమ్యకృష్ణ... తదితరులకు హ్యాట్సాఫ్ అన్నాడు.

నాగార్జున: బాహుబలి చిత్ర బృందానికి నా విషెస్... ఈ సమ్మర్ ఓ చిరకాల గుర్తింపుగా ఉండాలని కోరుకుంటున్నా.

రకుల్: థాంక్యూ రాజమౌళి సర్, ఇండియన్ సినిమా ని ప్రపంచానికి పోటీగా నిలిపినందుకు. ప్రతి ఫ్రేమ్ లో 5  సంవత్సరాల కృషి, ఇష్టం కనిపించింది. వెంట్రుకలు నిక్క బొడుచుకున్నాయి ఒక్కొక్క సీన్ చూస్తుంటే. ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క లకి దండం పెడుతున్నా. అంచనాలను మించిపోయారు. మరింత ఉన్నత స్థాయి కి చేరుకోవాలని కోరుకుంటున్నా. 

వరుణ్ తేజ్: ఇప్పుడంతా బాహుబలి మ్యానియానే నడుస్తుంది. బాహుబలి/శివుడు  భల్లాల దేవుడిని ఎప్పుడెప్పుడు చూస్తామా.. అని, థాంక్స్ రాజమౌళి గారు. ఎటువంటి పురాణం ని క్రియేట్ చేసినందుకు. 

నాని: బాహుబలి కేవలం ఒక సినిమా మాత్రమే కాదు... ఇదొక సెలబ్రేషన్ టైమ్... మమ్మల్ని గర్వపరిచినందుకు చిత్ర టీంకి థాంక్స్.

సాయి ధరమ్ తేజ్: ఒక మనిషి విజన్, సుమారు 500 వందల మంది కృషి, చెమ్మగిల్లిన కళ్ళు, 6 సంవత్సరాల పట్టుదల. ఇవన్నీ కలిపితే ఒక అద్భుతం. అదే బాహుబలి.  

మంచు లక్ష్మి: బాహుబలి 2 చూశాక నాకు మాటలు రావడం లేదు. టీం అందరికి, వాళ్ళ ఫ్యామిలీలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. రాజమౌళి దేవుడు అంతే. మైండ్ బ్లోయింగ్.  

అఖిల్: బాహుబలి 2  వంటి మహత్తర విజయంతో దేశ గౌరవాన్ని పెంచేసిన రాజమౌళి ఫ్యామిలీ కి కంగ్రాట్స్ చెబుతున్నా.

రామ్ గోపాల్ వర్మ: ఒక ఏనుగు వంటి సినిమా విడుదలనైనపుడు ఇతర సినిమాలు కుక్కల్లా మొరుగుతాయి. కానీ బాహుబలిలాంటి డైనోసార్ రావడంతో... కుక్కలతోపాటు పులులు సింహాలు కూడా దాక్కున్నాయని ట్వీట్ చేసాడు.

నివేత థామస్: బాహుబలి చిత్రాన్ని పొగిడేందుకు మాటలు రావడం లేదు. రాజమౌళి గారు మమ్మల్ని గర్వపరిచారు... మైండ్ బ్లోయింగ్.

అని రాజామౌళి  అండ్ టీమ్ ని ఆకాశానికెత్తేశారు.

Baahubali 2 - Celebrities Response :

'Baahubali : The Conclusion', which was the most eagerly awaited movie of the year, has finally hit the theatres after a wait of nearly two years and movie buffs are overwhelmed by the mania surrounded by it. Celebrities reactions on Baahubali.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement