Advertisement

బొజ్జల భార్య ఒక్కొక్కరిని ఉతికి ఆరేసింది..!

Tue 04th Apr 2017 10:42 AM
brundamma,bojjala rama krishna reddy,tdp,ganta srinivasa rao,andhra jyothy,vemuri radha krishna  బొజ్జల భార్య ఒక్కొక్కరిని ఉతికి ఆరేసింది..!
బొజ్జల భార్య ఒక్కొక్కరిని ఉతికి ఆరేసింది..!
Advertisement

రాజకీయనాయకులు, సినిమా వారు మీడియాను చాలా తెలివిగా వాడుకుంటారు. సినిమా వారయితే ఫలానా హీరోతో ఫలానా డైరెక్టర్‌ను కలిసి ఓ నిర్మాత చిత్రం చేయనున్నాడని, లేక ఓ హీరో సరసన ఫలానా హీరోయిన్‌ని అనుకుంటున్నారని, లేదా ఫలానా చిత్రానికి ఫలానా టైటిల్‌ను పెట్టాలని భావిస్తున్నారని ముందుగా వారే మీడియాకు లీక్‌ ఇస్తారు. ఆ తర్వాత ఫ్యాన్స్‌తోపాటు ఇతరుల అభిప్రాయాలను, ఫీడ్‌బ్యాక్‌ను గమనిస్తారు. తమకు వ్యతిరేకంగా ప్రేక్షకుల ఓపెనీయన్‌ ఉంటే వెంటనే ఆయా వార్తలను నమ్మవద్దు. అవన్నీ గాలి వార్తలు అని చెబుతారు. ఫీడ్‌బ్యాక్‌ అనుకూలంగా ఉంటే దానినే ఖరారు చేస్తారు. 

ఇక రాజకీయ నాయకులు కూడా అంతే. ఫలానా మంత్రిని క్యాబినెట్‌లోంచి తీసివేస్తున్నారని, ఫలానా మంత్రిపై సీఎం అసంతృప్తిగా ఉన్నాడని తమ అనుకూల వర్గాల పత్రికలకు, మీడియాకు తెలిపి వాటిపై వార్తలు, విశ్లేషణలు రాయమని చెబుతారు. దీని ద్వారా ఫలానా మంత్రికి ఉద్వాసన పలుకుతారని, ఆయన ఆరోగ్యం బాగాలేదని, లేదా ఆయన పనితీరు సీఎంకు అసంతృప్తిగా ఉందని, ఆయన అవినీతిని సీఎం గమనిస్తున్నాడని మీడియా ద్వారా చెప్పించి ఆయా మంత్రులను ముందుగానే మానసికంగా ప్రిపేర్‌ చేస్తారు. ఇలాంటి ఘటనే తాజాగా జరిగింది. 

సీనియర్‌ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కేబినెట్‌ నుంచి తొలగించారు. ఈ విషయాన్ని ముందుగానే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ వంటివి ప్రచారం చేశాయి. అనుకున్నంత అయింది. బొజ్జల ఒక్కసారిగా చంద్రబాబుపై తీవ్రంగా అలిగి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా అన్నాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆంధ్రజ్యోతి, ఎబిఎన్‌ల అధినేత వేమూరి రాధాకృష్ణ బొజ్జలకు, బాబుకు సంధి చేయాలని చూశాడు. వెంటనే తన పత్రిక, చానెల్‌లోని ప్రముఖ విలేకరిని బొజ్జల ఇంటి పంపి, గతంలో బాబుకు, బొజ్జలకు ఉన్న అనుబంధం, బాబు.. బొజ్జలకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించడం వంటి వాటిని ప్రశ్నిస్తూ బొజ్జలను శాంతపరిచే వ్యూహం అనుసరించబోయాడు. 

కానీ బొజ్జల భార్య మాత్రం ఆంధ్రజ్యోతి, ఎబిఎన్‌ ప్రతినిధిపై తీవ్రంగా మండి పడటమే కాదు.. రాధాకృష్ణ తాను జర్నలిస్ట్‌గా ఉన్నప్పుడు ఎన్నిసార్లు తమ ఇంటికి వచ్చి అవసరమని చెప్పి ఎన్ని విధాలుగా చివరకు వంద రెండొందలు కూడా తీసుకున్న వైనాన్ని ఆమె ఆ ప్రతినిధిని కడిగెేసిందని సమాచారం. ముందుగా వార్తలు, న్యూస్‌ ప్రచురించిన రాధాకృష్ణ రెండునాల్కల ధోరణిపై మండిపడి ఆయన్ను, ఆయనతోపాటు తమను సముదాయించడానికి వచ్చిన గంటా, సీఎం రమేష్‌లను ఇంటి నుంచి గెంటివేసిందని, గంటాను ఉద్దేశించి అసలు నువ్వు టిడిపిని నమ్ముకుని ఎంతకాలం ఉంటావు? నీవు ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్‌చేస్తావో నాకూ తెలుసు అని ఘాటుగా ప్రశ్నించడంతో బిత్తర పోవడం అందరి వంతైందని తెలుస్తోంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement