Advertisement

ఎన్టీఆర్..మాస్క్ భయపెట్టేస్తోంది..!

Sun 26th Mar 2017 09:15 PM
jr ntr,jai lava kusha,mask,bobby  ఎన్టీఆర్..మాస్క్ భయపెట్టేస్తోంది..!
ఎన్టీఆర్..మాస్క్ భయపెట్టేస్తోంది..!
Advertisement

ఎన్టీఆర్.. బాబీ డైరెక్షన్ లో మూడు విభిన్న పాత్రలతో కూడుకున్న ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల పేర్లు జై, లవ, కుశ అని అంటున్నారు. దాదాపు టైటిల్ కూడా 'జై లవ కుశ' అని ఖరారు చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇక ఎన్టీఆర్ మూడు పాత్రల్లో ఒకటి కామెడీ రోల్ కాగా మరొకటి యాక్షన్ రోల్ అని ప్రచారం జరుగుతుంది. మూడో రోల్ లో ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నట్లు మొదటి నుండి ప్రచారం జరుగుతుంది.

అయితే ఆ మూడో రోల్ సినిమాలో కొంచెం భయపెట్టే విలన్ రోల్ లా ఉంటుందని ఎన్టీఆర్ మూడో గెటప్ మాస్క్ చూస్తుంటే అర్ధమవుతుంది. నెగెటివ్ రోల్ కాబట్టి ఆ రోల్ ని కొంచెం భయంకరంగా చూపాలనే ఉద్దేశ్యంతో హాలీవుడ్‌ సినిమాలకు పనిచేసిన మేకప్‌మేన్‌ వాన్స్‌ గార్ట్‌వెల్‌ తో ప్రత్యేకంగా కొన్ని మాస్క్ లు తయారు చేయించింది చిత్ర యూనిట్. అలా తయారు చేసిన ఎన్టీఆర్ మాస్క్ పిక్స్ ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇక ఆ మాస్క్ లో ఎన్టీఆర్ పెంచిన గెడ్డంతో కొంచెం భయానకంగా గుండు గీయించినట్లు తయారు చేశారు. 

మరి అలా ఎన్టీఆర్ మాస్క్ చూస్తుంటే ఈసారి ఎన్టీఆర్ చాలా కొత్తగా ట్రై చేస్తున్నాడనిపిస్తుంది. నెగెటివ్ రోల్ కాబట్టి కొంచెం భయానకంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆ మాస్క్ లను ఇలా రూపొందించినట్లు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్ గా రాశి ఖన్నా ఫైనల్ కాగా మరో హీరోయిన్ గా నివేత థామస్ ని అనుకుంటున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement