Advertisement

ఈ క్రియేటివ్‌ జీనియస్‌లకేమైంది..?

Thu 23rd Mar 2017 02:44 PM
maniratnam,creative genius,cheliyaa,guru,cheliyaa movie  ఈ క్రియేటివ్‌ జీనియస్‌లకేమైంది..?
ఈ క్రియేటివ్‌ జీనియస్‌లకేమైంది..?
Advertisement

క్రియేటివ్‌ ఫీల్ద్‌లో వయసు, అనుభవం పెరిగే కొద్ది క్రియేటివిటీ మరింతగా పెరుగుతుందని, సృజనాత్మకతకు ఎల్లలు లేవని కొందరంటారు. కాదు.. కాదు.. అని..ఒకానొక స్థాయిలో క్రియేటివ్‌ ఆలోచనలు తగ్గుతాయని, మనసు, మెదడు విశ్రాంతిని కోరుకుంటాయని కొందరు వాదిస్తారు. ఈ చర్చకు ఇరువైపులా పదునున్నాయి. స్వర్గీయ బాపుతో పాటు దాసరి, కె.విశ్వనాథ్‌, బాలచందర్‌, బాలూ మహేంద్రల నుంచి కోడిరామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య వరకు ఎందరో దర్శకులు నేటి ట్రెండ్‌కు అనుగుణంగా చిత్రాలు తీయలేక, నేటితరం నాడి పట్టుకోలేక, తమ పాత చిత్రాల కథలనే మరలా మరలా కాపీ కొట్టారనే విమర్శలు కూడా ఉన్నాయి. 

ఇక క్రియేటివ్‌ జీనియస్‌గా పేరున్న మణిరత్నం కూడా అదే కోవలోకి వస్తున్నాడా? అనే అనుమానం కలుగుతోంది. దాదాపు దశాబ్దంగా ఆయనకు 'ఓకే బంగారం' తప్పితే పెద్ద హిట్‌లేదు. 'గురు' హిట్టయినప్పటికీ మణి స్థాయి చిత్రం అది కాదు. ఇక వరుస పరాజయాల్లో ఉన్న ఆయన అలనాటి 'సఖి'ని ఫాలో అవుతూ, అదే మ్యాజిక్‌ను రిపీట్‌ చేసి 'ఓకే బంగారం'తో హిట్‌ కొట్టాడు. ఇక తాజాగా ఆయన దరకత్వం వహిస్తోన్న 'చెలియా' (కాట్రు వెలియాదై) చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. 

మొదటి ట్రైలర్‌లో రొమాంటిక్‌ సీన్స్‌ని చూపించిన మణి ఈ తాజా ట్రైలర్‌లో యాక్షన్‌, రొమాన్స్‌ను కలిపి చూపించాడు. కార్తీ యుద్ద విమాన పైలెట్‌గా, ఆదితిరావు హైద్రి డాక్టర్‌గా నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ను చూస్తే ఒకప్పుడు మణి తీసిన 'రోజా, ముంబై, దిల్‌సే' వంటి చిత్రాలు గుర్తుకు రాకమానవు. ఈ చిత్రాలన్నీ టెర్రరిజం, ఎమోషన్స్‌, రొమాన్స్‌ నేపధ్యంలో తెరకెక్కాయి. ఈ 'చెలియా' కూడా అదే ఛాయల్లో ఉంది. 

ఇక ఈ చిత్రం ఏప్రిల్‌7న విడుదల కానుంది. ఈ చిత్రం రిలీజ్‌ అయిన తర్వాత ఈ సస్పెన్స్‌ వీడిపోతుంది. ఇక మణి గతంలో తాను తీసిన 'దళపతి', 'నాయకుడు' చిత్రాలను కూడా నేటి ట్రెండ్‌కు అనుగుణంగా తీయాలని భావిస్తున్నాడట. చరణ్‌, విక్రమ్‌, విజయ్‌లతో ఆయన తీయాలనుకుంటున్న మల్టీస్టారర్‌ కూడా 'దళపతి' తరహా స్టోరీనే తెరకెక్కించనున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయాలన్నీ బయటకు రావాలంటే కొంత కాలం వెయిట్‌ చేయక తప్పదు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement