Advertisement

హీరోలంతా.. ఇక పొలిటికల్ బాట పడుతున్నారు!

Wed 22nd Mar 2017 09:21 PM
tollywood heroes,political trend,mahesh babu,pawan kalyan,manchu vishnu,rana,balakrishna  హీరోలంతా.. ఇక పొలిటికల్ బాట పడుతున్నారు!
హీరోలంతా.. ఇక పొలిటికల్ బాట పడుతున్నారు!
Advertisement

దక్షిణాదిలో మరీ ముఖ్యంగా తమిళం, తెలుగు భాషల్లో సినిమాలకు, రాజకీయాలకు ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు ఒకదానితో మరొకటి మమేకమైపోయాయి. ఇక మన హీరోలు ఎందరో రాజకీయాలలోకి ఎంటర్‌ అయ్యారు. మరికొందరు రాజకీయాలలో ఉంటూనే చిత్రాలు చేస్తున్నారు. ఇక ప్రత్యక్షంగా రాజకీయాలలోకి రావడమే కాదు.. ఇప్పుడు స్టార్‌ హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరూ రాజకీయనేపధ్యం ఉన్న కథల వైపు ఆసక్తి చూపుతున్నారు. 

'శ్రీమంతుడు'తో సంచలనం సృష్టించిన మహేష్‌బాబు-కొరటాల కాంబినేషన్‌ త్వరలో మరోసారి జోడీ కట్టనుంది. 'శ్రీమంతుడు'లో గ్రామాల దత్తత గురించి చెప్పిన ఈ జోడీ తాజా చిత్రంలో మంచి రాజకీయాలు, రాజకీయ నాయకులంటే ఎలా ఉండాలి? అనే అంశం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో మహేష్‌ సీఎంగా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే 'భరత్‌ అనే నేను' అని ప్రమాణ స్వీకారంలో వాడే పదాలను ఈ చిత్రానికి టైటిల్‌గా నిర్ణయించారు. ప్రీపొడక్షన్‌ పనులు మొదలైనాయి. దేవిశ్రీప్రసాద్‌ సంగీతంలో ఈ చిత్రంలోని మూడు పాటలు కూడా రికార్డు అయ్యాయంటున్నారు. మిగిలిన పాటలకు సంబంధించి మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి. 

మరోవైపు పవన్‌కళ్యాణ్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో త్వరలో పట్టాలెక్కనున్న హ్యాట్రిక్‌ మూవీ కూడా రాజకీయ నేపథ్యంలో, పవన్‌ పొలిటికల్‌ కెరీర్‌కు మైలేజ్‌ ఇచ్చేదిగా ఉండనుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే పలు పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ డైలాగ్స్‌ని చేప్పే బాలకృష్ణ సైతం పూరీ జగన్నాథ్‌ చిత్రంలో ఆ తరహాలో కొన్ని సీన్స్‌, డైలాగ్స్‌ చేయనున్నాడట. నందమూరి కళ్యాణ్‌రామ్‌ కూడా 'ఎమ్మెల్యే' గా రానున్నాడు. కొత్త దర్శకుడు ఉపేంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. మొదట్లో సునీల్‌ కోసం తయారు చేసిన ఈ కథ చివరకు కళ్యాణ్‌రామ్‌ వద్దకు చేరింది. 

మంచు విష్ణు కూడ ఇప్పడు కార్తీక్‌రెడ్డి దర్శకత్వంలో 'ఓటర్‌' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కథ కూడా పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుందిట. ఇప్పటికే మూడు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది. ఇక రానా అయితే త్వరలో 'లీడర్‌' చిత్రానికి సీక్వెల్‌ చేయనున్నాడు. ప్రస్తుతం ఆయన తేజ దర్శకత్వంలో చేస్తున్న 'నేనే రాజు.. నేనే మంత్రి' కి కూడా పొలిటికల్‌ నేపధ్యం ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు మన హీరోలు పొలిటికల్‌ చిత్రాల ట్రెండ్‌కు తెరతీశారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement