Advertisement

పవన్ ఎందుకిలా చేస్తున్నాడు...?

Sun 19th Mar 2017 08:04 AM
pawan kalyan,katamarayaudu pre release function,mega family,ram charan,chiranjeevi,allu arjun  పవన్ ఎందుకిలా చేస్తున్నాడు...?
పవన్ ఎందుకిలా చేస్తున్నాడు...?
Advertisement

మెగాఫ్యామిలీకి, పవన్‌కి మధ్య సరైన సత్సంభందాలు లేవనేది బహిరంగ రహస్యం. కానీ దీనిని మెగాభిమానులే కాదు.. ఎవ్వరూ పైకి మాత్రం ఒప్పుకోవడం లేదు. తామంతా ఒకటే అనే భావనను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సీక్రెసీ మెయిన్‌టెయిన్‌ చేయాలని భావిస్తున్నారు. కానీ నిజాలను ఎల్లకాలం దాచడం సాధ్యం కాదు. కాగా మెగాహీరోలు జరిగే ప్రతి ఈవెంట్‌కి పవన్‌ వస్తున్నాడనే వార్తలు రావడం, అభిమానులు కూడా వేదిక, వేడుక ఏదైనా సరే పవర్‌స్టార్‌ కోసం హోరెత్తడం.. ఎవరో ఒకరు ఆ విషయాన్ని సర్ధిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇక 'ధృవ' నుండి మాత్రం మెగాభిమానులు కూడా పవన్‌ రాడు అనే నిర్ణయానికి వచ్చేశారు. ఇక తన అన్నయ్య 150వ ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీ నెంబర్‌ 150' చిత్రం ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌కి గుంటూరుకు పవన్‌ వస్తాడని కొందరు భావించినా, పవన్‌ రాడని 99శాతం మంది ముందుగానే ఫిక్సయ్యారు. దాంతో ఇక పవన్‌ రాకపోవడమే మంచిదని మెగాఫ్యామిలీ వారు, ఇక తమ హీరో రాడని మెగాభిమానులు సైలెంట్‌ అయిపోయారు. ఇక ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో 'కాటమరాయుడు' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరగనుంది. ఈ వేడుకను ఆర్భాటంగా వేలాది మందిలో కాకుండా కేవలం కొందరితో మాత్రమే జరపడానికి నిర్ణయించి, బహిరంగ వేదికను కాకుండా శిల్పకళావేదికను ఎంచుకున్నారు. ఇక ఇదే వేడుకలో పవన్‌ సినీ జీవితాన్ని ఇరవైయేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగానైనా పెద్ద ఫంక్షన్‌ చేయాలని ఎందరు ప్రయత్నించినా పవన్‌ మాత్రం సింపుల్‌గా చేయడానికే డిసైడ్‌ అయ్యారు. కేవలం ఈ చిత్రం యూనిట్‌ మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటారని సమాచారం. 

మరోవైపు పవన్‌ పనిచేసిన దర్శకులను, నిర్మాతలను సన్మానించాలని భావించి, ఆ తర్వాత అల్లుఅరవింద్‌ని, నాగబాబును పిలవాల్సివస్తుందనే కారణంగా దానిని కూడా పవన్‌ వద్దనుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వేడుకకు చిరు వచ్చేది లేదని విశ్వసనీయ సమాచారం. కనీసం ఈ చిత్రం వేడుక ఇన్విటేషన్‌ కూడా చిరుకు అందలేదట. ఇక ఈ వేడుకకు రామ్‌చరణ్‌, బన్నీ మాత్రం హాజరవుతారని, తద్వారా పవన్‌ అభిమానులతో బన్నీకి చెడిన విషయాన్ని సరిదిద్దాలనే ఆలోచనలో అల్లుఅరవింద్‌ ఉన్నాడని సమాచారం. మరి కొన్ని గంటలు ఆగితేగానీ అసలు విషయం తెలియదు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement