Advertisement

ఏపీ పై కేంద్రం ఆటలాడుకుంటోంది..!

Fri 17th Mar 2017 07:35 PM
andhra pradesh,central government,special package,bjp,tdp,ap state  ఏపీ పై కేంద్రం ఆటలాడుకుంటోంది..!
ఏపీ పై కేంద్రం ఆటలాడుకుంటోంది..!
Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా విభజించే సందర్భంలో కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కింది కేంద్రప్రభుత్వం. ఆ తర్వాత కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదాకి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ పేరుతో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు న్యాయబద్ధంగా రావల్సిన హక్కుల్ని కూడా బలవంతంగా పక్కకు నెట్టింది కేంద్రం. అప్పట్లో ప్రత్యేక హోదాపై రాష్ట్రం రావణ కాష్టంలో రగులుతున్న నేపథ్యంలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో చెప్పిన మాటలను ఏడు నెలల తర్వాత కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించడం జరిగిందే తప్ప అందులో కేంద్రం కొత్తగా ఎటువంటి చట్టబద్ధత కల్పించే విషయంలో తీసుకోవాల్సిన స్టెప్ తీసుకోలేదు. కేంద్రం పాలనాపరమైన నిర్ణయమే తీసుకుంది తప్ప అందులో ఎలాంటి రాష్ట్రోపయోగ పూరిత అంశం ఏమాత్రం లేదన్నది తర్వాత తెలిసింది. కానీ అప్పటికే 'ప్రత్యేక హోదాకు చట్టబద్ధత' అంటూ మీడియా నానా హడావుడి చేసి బ్రేకింగ్ న్యూసులతో టివిలు తమ అఙ్ఞానాన్ని చాటుకున్నాయి. ఆ తర్వాత తప్పిదానికి సిగ్గుపడి ఓ కాసేపు పొడిపొడిగా వార్త చదివి కిమ్మనకుండా ఉండటం మీడియా వంతు అయింది. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణవ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరించాలన్నది విభజనచట్టంలో చాలా స్పష్టంగా రాసి ఉంది. కానీ... అది నాబార్డు ద్వారా ఆ సహాయం చేయడానికే కేంద్రం అంగీకరించింది. తాజా అంచనాల ప్రకారం పోలవరం నిర్మాణవ్యయం 42 వేల కోట్ల రూపాయలు అని రాష్ట్రప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ రకంగా మారిన అంచనాలను కేంద్రానికి పంపి ఆమోదం కూడా పొందలేదు. ఇప్పటికి పోలవరంపై ఖర్చు చేసిన మొత్తాన్ని కూడా కేంద్రానికి లెక్కా జమా చెప్పలేదు. ఇలాంటి సమయంలో పోలవరం ప్రాజెక్టులో ఇరిగేషన్ కంపోనెంటుకి మాత్రమే కేంద్రం సాయంచేస్తుందన్న కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీన్ని బట్టి చూస్తే పోలవరం ప్రాజెక్టుకు డిల్లీ నుంచి ఎటువంటి నిధులు రాకపోవచ్చన్న అభిప్రాయాన్ని ఆ ప్రాజెక్టు ఇంజనీర్లు వెలిబుచ్చుతున్నారు.  కాగా ప్రత్యేక హోదా కారణంగా రాష్ట్రప్రభుత్వానికి పారిశ్రామిక రంగం అభివృద్ధి విస్తరణలకు 90 శాతం నిధులు రావలసి వుంది. అయితే ప్రత్యేక ప్యాకేజీ కారణంగా అది 60 శాతానికి పడిపోయింది. మిగిలిన 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన విదేశీ సంస్ధల రుణాలను 2015 నుంచి కూడా ఐదేళ్ళ పాటు కేంద్రప్రభుత్వమే తీర్చడం ద్వారా సర్దుబాటు చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. ఇలా సంవత్సరానికి 3 వేల కోట్లరూపాయల చొప్పున ఐదేళ్ళకి 15 వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పటికే రెండేళ్ళు గడవగా విదేశీ రుణాలు తీసుకోడానికీ కేంద్రం అనుమతి తప్పనిసరి. అలా ఇప్పటికి తెచ్చుకున్న విదేశీ రుణాలు వాటి వినియోగంపై లెక్కలు చెప్పి 6 వేలకోట్ల రూపాయలు రాబట్టుకోవలసిన అవసరం ఉంది. అయితే పార్లమెంటు సాక్షిగా చెప్పిన విషయాలే కేబినెట్ లో ఆమోదం పొందడానికి ఇంతకాలం అంటే దాదాపు 7 నెలలు పడితే లెక్కలు చెప్పి విదేశీ రుణంపై అనుమతులు పొందడం ఇంకెంత కాలం పట్టాలి.

అయితే తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాలను చూసుకుంటే భాజపా తాను అనుకున్నదే చేస్తుంది తప్ప.. ఏదో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అడిగిందని చేసే వాతావరణం కనిపించడం లేదు.  తాజాగా జరిగిన కేబినెట్ నిర్ణయంతో ఏపీపై కేంద్రం వైఖరి స్పష్టంగా తెలిసిపోయింది. నిజంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య, పార్టీలు, ప్రభుత్వాలకు మధ్య రాజకీయ వాతావరణం బహుబాగుగా ఉంటేనే తప్ప లేకపోతే ఫైళ్ళు చక్కగా పరుగులు తీయలేవు. అలా ప్రత్యేక ప్యాకేజీని కేబినెట్ ఆమోదించడం అంటే దాన్ని ఉన్నత స్ధాయిలో నిర్ణయం తీసుకున్నారే తప్ప చట్టంగా చేయలేదు. దీనిపై రాజకీయ విశ్లేషణలు గానీ, రాష్ట్రంలోని అధికార పార్టీగానీ ఎటువంటి చర్చ చేయకపోవడం చాలా దురదృష్టకరం. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement